Pizza



కావలసిన పదార్దాలు    :
మైదా  4 కప్పులు
నూనే  4 చెంచాలు
ఈస్టు  2 చెంచాలు
పాలు  1 కప్పు
పంచదార  కొంచం
ఉప్పు  సరిపడా
నీరు  కలపటానికి సరిపడా
పిజ్జా పైన డెకరేషన్ కి   :
ఉల్లిపాయలు  4
బెంగుళూరు  మిర్చి   4
టమోటో   4
కుకింగ్ చీజ్   100 గ్రామ్స్
టమోటో సాస్  6 చెంచాలు
ఉప్పు, మిరియాల పొడి  సరిపడా
వెన్న   ౩ చెంచాలు
తయారి విదానం   :
        ఈస్టు కు పంచదార కలిపి పావుగంట సేపు వెచ్చటి పాలలో నాననివ్వాలి. ఒక బేసిన్ లో మైదా, ఉప్పు, నూనే వేసి బాగా కలిపి ముద్దను మద్యలో గుంటగా చేసి దాంట్లో నానిన పాలు, ఈస్టు మిశ్రమాన్ని పోసి దీనికి వేడి నీరు సరిపడా చేర్చి కలిపి మెత్తని  పిండి (చపాతి పిండి లా ) తయారుచేసి బాగా పిసికి ఉంచాలి. 5 నుండి 6 గంటల వరకు వెచ్చని ప్రదేశం లో మూత పెట్టి ఉంచాలి. ఈ పిండి రెండింతలు అవుతుంది. అరచేతికి సరిపడా ముద్ద తీసుకోని చపాతి మాదిరిగా వట్టి పైన ఫోర్క్ తో అనేక చోట్ల గుచ్చాలి . దీని వలన బేకింగ్ చేసేటప్పుడు పిండి పొంగకుండా ఉంటుంది. 275 డిగ్రిస్ వరకు ఓవెన్ ని వేడిచేయాలి. ఓవెన్ ప్రూఫ్ డిష్ పైన  నూనే పూసి వరుసగా ఈ చపాతిలాంటి వాటిని పేర్చి 7 నిముషాలు వేడి చేయాలి. ఓవెన్ నుంచి తీసి  చపాతిల పైన వెన్న రాయాలి.పైన చక్రాల్లాగా తరిగిన ఉల్లి, టొమాటో, బెంగళూరు మిర్చ్ లను డెకరేట్  చేసి సర్వ్ చేయాలి.                     
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top