Baby Corn Mixed Curry



బేబీకార్న్ మిక్స్‌డ్ కర్రీ
కావలిసినవి:
టొమాటోలు - నాలుగు
ఉల్లిపాయ - 1
వంకాయలు -
మునగకాడ - 1(నార తీసి చిన్న ముక్కలుగా కట్ చేయాలి)
బేబీకార్న్స్
పచ్చిమిర్చి - 4
అల్లం వెల్లుల్లి ముద్ద - టీ స్పూన్
నూనె - టేబుల్ స్పూన్
ఆవాలు, జీలకర్ర - టీ స్పూన్
మీగడపాలు - టేబుల్ స్పూన్
కొబ్బరి పొడి - టీ స్పూన్
కరివేపాకు - రెండు రెబ్బలు
కొత్తిమీర - టేబుల్ స్పూన్
తయారి:
1.ప్రెజర్ పాన్‌లో నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర చిటపటలాడించి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు వరుసగా వేసి గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి.

2.మునగకాడముక్కలు వేయించి, కరివేపాకు, టొమాటోలు, వంకాయలు రెండు నిమిషాలు వేయించాక బేబీకార్న్ వేసి వేగాక, ఉప్పు, కొబ్బరి పొడి కలిపి మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి.

3.మంట చిన్నది చేసి ప్రెజర్ ప్యాన్ గ్యాస్ పోయిన తరవాత మూత తీసి మీగడ పాలు పోసి అయిదు నిమిషాలు ఉంచాలి. మిశ్రమం దగ్గరకయ్యాక దింపేయాలి.

4.చపాతీల్లోకిగాని, వేడి అన్నంలోకి గాని వడ్డిస్తే రుచిగా ఉంటాయి.


block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top