Ellora Caves


ఎల్లోరా
దేశంలోకెల్లా ప్రసిద్ధమైన ఎల్లోరా గుహలు మహారాష్ర్టలో ఉన్నాయి. హైదరాబాద్‌ నుండి మన్మాడు వెళ్ళే రైలు మార్గంలో ఉన్న ఔరంగాబాద్‌ స్టేషన్‌కు 26 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గుహలను చూడడానికి రెండు కళ్ళూ చాలవు. అజంతా గుహలు కూడా ఇక్కడకు దగ్గరలోనే ఉన్నాయి.అందుకే అజంతా - ఎల్లోరా గుహల చిత్ర శిల్పాలు భారతీయ కళావేత్తలనే కాకుండా ప్రపంచ కళాకోవిదులను కూడా ఆకర్షించి ప్రశంసలు అందుకున్నాయి. ఇవి ప్రకృతి రమణీయాలైన నదీ పర్వతారణ్య పరిసరాలలో ఉండడం ఒక విశేషం. ఆ పర్వత సానువుల్లో పలు రకాలైన సెలయేర్లూ ఎంతో మోహనంగా అలరిస్తాయి.ఇలాంటి అందమైన ప్రదేశాల్లోనే మునులు తపస్సు చేసుకునేవారేమో! ప్రకృతి కళోపాసకులు, శిల్పులు, బౌద్ధ భిక్షువులు ఇలాంటి సుందర ప్రదేశంలోనే ఆ ళాలక్ష్మికి నీరాజనాలు పలికారు. తరతరాలుగా ఈ ప్రకృతి అందాలు పర్యాటకుల మది దోచుకుంటూనే వున్నాయి. సృష్టికే శోభనిచ్చేంతటి సౌందర్యం ఎల్లోరా సొంతం. అందుకే భారతీయ శిల్పకళా పరిశోధనకు, ఆ విలువైన అందాలను ఆస్వాదించడానికి ఎందరో విదేశీయులు అజంతా ఎల్లోరా గుహలను సందర్శిస్తుంటారు.
అనేక శతాబ్దాలుగా ఎల్లోరా గ్రామం వెరూల్‌ అనే పేరుతో ప్రసిద్ధి గాంచింది. ఈ గ్రామం ప్రాచీన వాణిజ్యకేంద్రంగా పేరు పొం దింది. అరబ్‌, యూరప్‌ దేశాల నుండి ప్రజలు తమ వ్యాపార అవస రాలకు ఈ గ్రామం దర్శించేవారట. ఎల్లోరా కొండల్లోని 34 గుహ ల్లో శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. ఇందులో హిందూ, బౌద్ధ, జైన మతాలకు చెందిన శిల్పరీతుల్ని ప్రతిబింబించే అపురూప శిల్పాలు సర్వమత సౌభ్రాత్రుత్వాన్ని చాటుతున్నాయి. మొదటి 12 గుహలు బౌద్ధమతానికి చెందినవి. వీటిని ఐదో శతాబ్ధం నుండి ఎనిమిదో శతాబ్దం మధ్య కాలంలో చెక్కారు. 13వ గుహ నుండి 29వ గుహ వరకు హిందూ మతానికి సంబంధించిన దేవతలూ, పౌరాణిక థల ను తెలుపుతాయి. ఇవి ఆరవ శతాబ్దం నుండి తొమ్మిదవ శతాబ్దంలో చెక్కినవి. 5 గుహలు అంటే 30 నుండి 34 గుహల వరకూ జైన మతానికి సంబంధించినవి. వీటిని ఎనిమిది - పది శతాబ్దాల మధ్య కాలంలో చెక్కినవి.


ఈ గుహల్లో ఎక్కువ భాగం ధ్యానాది సాధనలు, విద్య గడపడానికి వచ్చిన బౌద్ధ భిక్షువుల కొరకు ప్రత్యేక గదులుగా విభజింపబడ్డా యి. కొన్ని గుహలు రెండు అంతస్తులు, మరికొన్ని 3 అంతస్తులుగా ఉండి గాలి, వెలుతురు ధారాళంగా వచ్చే విధంగా కట్టబడి ఉన్నాయి. ఈ ఎల్లోరా గుహలన్నింటి లో మొదటి గుహ చాలా ప్రాచీనమైనది. రెండో గుహ శిల్పకళ తో కూడిన ఒక చైతన్యశాలగా ఉంటుంది. దీనిలో బుద్ధుడి గురించిన వివిధ మూర్తులు, బోధిసత్వుని మూర్తులున్నాయి. దీనిపై కప్పు పెద్దపెద్ద 12 స్తంభా లపై ఆధారపడి ఉంటుంది. ఈ గుహ గర్భాలయంలో సింహాసనాధీసుడై ఉన్న బుద్ధుని విగ్రహం ఉంది. ఈ శిల్ప విగ్రహం చూపరులను ఆకట్టుకుంటుంది.

10వ గుహనే విశ్వకర్మ చైతన్యమని అంటారు. ఎల్లోరాలో చైత్యశాల ఇది ఒకటే. ఇది గొప్ప శిల్ప విన్యాసంతో బౌద్ధ గుహాలయాలన్నింటికీ మకుటాయ మానంగా వెలుగొందుతోంది. ఈ గుహాలయాన్ని విశ్వకర్మ గుహ అని పిలు స్తారు. విశ్వకర్మ అనే శిల్పాచార్యుడు ఒక్కరాత్రిలోనే తన పరివారంతో ఈ గుహలో శిల్పాలను చెక్కాడట. అందుకే ఈ గుహకు విశ్వకర్మ గుహాలయం అనే పేరు వచ్చిందని ఇక్కడివారు చెబుతారు. ఆయన ఒక్కరాత్రిలో నిర్మించా రో లేదో అనే మీమాంసకు వెళ్లకుండా ఈ గుహను పరిశీలిస్తే అద్భుతమైన శిల్పాలతో చాలా మనోహరంగా ఉంటుంది.ఇక్కడ బుద్ధుని మూర్తి చాలా శాంతంగా, ధ్యానంలో నిమగ్నుడై ఎంతో సౌందర్యంగా ఉంటుంది.


అలాగే ఈగుహలో ఒక ప్రత్యేకత కూడా ఉంది. మనం ఒక ధ్వని చేస్తే అది ప్రతి ధ్వనించి ఆ ప్రతిధ్వనుల పరంపరలు మళ్లీ మనకే విన్పిస్తూ మెల్లగా తగ్గుతూ ఒక విధమై న ధ్వని సొంపుతో ముగుస్తాయి. ఈ ధ్వనులు వింటుంటే మళ్లీ మళ్లీ మనం ధ్వని చేయాలన్పిస్తుంది. అంతేకాక ఒక స్తంభాన్ని మనం మోగిస్తే ఇంకొక స్తంభం నుండి ధ్వని విన్పిస్తుంది. నిజంగా ఈ విశ్వకర్మ గృహాలయం చాలా వింత గొలుపుతుంది.

హిందూ మతగుహలు...
13వ గుహ నుండి 29వ గుహ వరకు హిందూ మతానికి, హిందూ పౌరాణిక కథలను తెలిపే శిల్పాలతో ఉన్నాయి. వీటిలో 14వ గుహ రావణ పరా భావ శిల్పం అత్యద్భుతం. 15వ గుహలో నట రాజ శిల్పం, లింగం నుండి ఉద్భవిస్తున్నట్లుగా పరమేశ్వరుడు, ఆయనను స్తుతిస్తున్నట్లుగా బ్రహ్మ, విష్ణువుల శిల్పాలు అమోఘం. 16వ గుహ కైలాస గుహ అంటారు. ఈ కైలాసనాధ దేవాలయపు శిల్పం చాలా అద్భుతంగా ఉంది. ఈ దేవాలయం మొత్తం ఒకే రాతితో తొలిచి శిల్పించారు. అలాగే ఈ ఆల యం ముందు కూడా రాతి ధ్వజస్తంభం కూడా చాలా అద్భుతం. అలాగే 29వ గుహలో రావణుడు కైలాస పర్వతాన్ని ఎత్తబోవడం, శివుడు తన పాదంతో పర్వతాన్ని నొక్కడం ఈ భావాలన్నీ స్పష్టంగా ఈ శిల్పంలో చూ స్తాం.


ఈ అద్భుతమైన శిల్పాలను చూడడం కోసం యాత్రికులు తప్పకుండా ఈ గుహను చూడాల్సిందే. 21వ గుహను రామేశ్వర గుహాలయం అంటా రు. 22వ గుహ నీలకంఠగుహ అంటారు. ఈ గుహలో సప్త మాతృకలు, గణపతి, నదీ దేవతలు తదితర విగ్రహాలున్నాయి. 25వ గుహలో సూర్యుడు ఏడు గుర్రాలను కట్టిన రథమెక్కి ఉన్న శిల్పం అద్భుతంగా ఉంటుంది. 21, 22 గుహల్లో శివపార్వతుల కళ్యాణం, శివుడు తాండవం చేస్తున్నట్లున్న శిల్పాలున్నాయి. జగన్మోహనమైన ఈ గుహాలయం రాష్ట్ర కూటుల నిర్మాణ శైలిని పోలివుంది. మొత్తం మీద ఎల్లోరాలోని హిందూ మత గుహల్లోని పౌరా ణిక కథలను తెలిపే శిల్పాలన్నీ శైవమత ప్రాధాన్యతను కళ్ళకు కట్టినట్టు చూపుతున్నాయి.

జైనమత గుహలు...
మిగిలినవి ఐదు గుహలు. ఈ ఐదూ జైనులకు సంబంధించినవి. ఇవి క్రీస్తు శకం 9వ శతాబ్దం నుండి 11వ శతాబ్దం మధ్య కాలంలో చెక్కినట్లున్నాయి. ఈ గుహల్లో జైన మహావీరుడి జన్మ వృత్తాంతాన్ని తెలిపే రాతి శిల్పా లున్నాయి. 32వ గుహలో గోమటేశ్వరుడి శిల్పం చాలా అద్భుతం గా ఉంటుంది. ఎల్లోరా గుహలకు సమీపంలోనే ఒక జ్యోతి ర్లింగ క్షేత్రం కూడా ఉంది. ఇక్కడి కొలువై ఉన్న స్వామిని ఘృష్ణేశ్వరుడు అంటారు. దేశంలో ఉన్న పురాతన శైవ క్షేత్రాల్లో ఈ ఆలయం కూడా ఒకటి. ఎల్లోరా సంద ర్శనకు వచ్చిన యాత్రికులు ఘృష్ణేశ్వర స్వామిని కూడా దర్శించుకుంటారు.
Share on Google Plus