Ribbon Paneer


రిబ్బన్‌ పనీర్‌

కావలసిన పదార్థాలు:
పనీర్‌: 2cups
వెల్లుల్లి: 10grm
మైదా: 1 cup
పాలు: 2 cups
టొమాటో సాస్‌: 3 tsp
కార్న్‌ఫ్లోర్‌: 50grms
ఉప్పు: రుచికి సరిపడా
ఆయిల్‌: కావలసినంత
అజినోమాటో: చిటికెడు
తయారు చేయు విధానం:
 పనీర్‌ను రెండున్నర అంగుళాల పొడువుండేటట్లుగా ముక్కలుగా కోసి ప్లేటులో అమర్చాలి. వాటిపైన టొమాటో సాస్‌, సన్నగా తరిగిన వెల్లుల్లి, కారం, ఒక టీస్పూన్‌ కార్న్‌ఫ్లోర్‌, ఒక టీస్పూన్‌ మైదా కలిపి పదినిమిషాలు అలాగే ఉంచాలి. ఒక గిన్నెలో కార్న్‌ఫ్లోర్‌, మైదా, పాలు కలిపి జారుడు పిండిలా తయారు చేయండి. తరువాత తగినంత ఉప్పు, అజినోమాటో వేశాక, కొంచెం వేడిచేసిన పాన్ లో గరిటెడు పిండిని పలుచని అట్టులాపోసి మళ్లీ స్టౌ మీద పెట్టి ఉడికిస్తే. పాన్‌ కేక్‌ తయారవుతుంది. ఈ పాన్‌ కేక్‌ను సన్నగా రిబ్బన్‌ లా కట్‌చేసి పెట్టుకోవాలి.ఇప్పుడు నానబెట్టి ఉంచిన ఒక్కో పనీర్‌ ముక్కనూ తీసుకుని, పాన్‌ కేక్‌ రిబ్బన్‌లో లూజ్‌గా చుట్టి, వేడి నూనెలో వేసి ఎర్రగా ఫ్రై చేస్తే సరి రిబ్బన్‌ పనీర్‌ సిద్ధం.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top