శిరోవ్యాధులకు 'భృంగామలక తైలం'


భృంగామలక తైలంతో తల వెంట్రుకలు రాలిపోయే (ఎలోపేషియా) సమస్య తొలగిపోతుంది. బట్టతల వచ్చేసినా ఇంకా కేశమూలాలు మిగిలి ఉంటే తిరిగి వెంట్రుకలు పెరిగే అవకాశం ఉంది. ఇందుకు ఉసిరిలోని గాలిక్ యాసిడ్స్, భృంగాలోని సపోనిన్స్, యష్టిమధులోని స్టిరాల్స్ అనే రసాయనాలు ఉపకరిస్తాయి.
            భృంగా (గుంటగలగర మూలిక), ఆమలక(ఉసిరికాయలు) ఈ రెండింటినీ ప్రధానంగా కలిపి తయారు చే యడం వల్ల దీనికి భృంగామలక తైలం అన్న పేరు స్థిరపడింది. ఈ రెండింటికి తోడు తగిన పాళ్లలో యష్టిమధు చూర్ణం, ఆవుపాలు, నువ్వులనూనె క లిపి 'తైలపాక విధి'లో ఆయుర్వేద వైద్య ఫార్మసిస్టులు ఈ తైలాన్ని తయారు చేస్తారు.

          ఇదే పేరుతో గానీ, కేవలం భృంగరాజ తైలమని గానీ, కొన్ని మూలికల మార్పులు, చేర్పులతో ఆమలక తైలం, మహా భృంగామలక తైలం, మహాభృంగరాజ తైలం, నీలి భృంగామలక తైలం అన్నపేర్లతో కూడా అన్ని ప్రముఖ ఆయుర్వేద దుకాణాల్లో లభిస్తాయి. * భృంగామలక తైలాన్ని తలకు గానీ, చర్మం పైనగానీ, మర్ధనంగా వాడవచ్చు. కొన్ని సార్లు ముక్కులో చుక్కలుగా కూడా వాడవచ్చు. మర్ధన చేసినప్పుడు తైలంలోని ఔషధ గుణాలు చర్మం ద్వారా రక్తంలోకి ప్రవేశించి కొన్ని ప్రయోజనాలు కలుగుతాయి.

         ముఖ్యంగా ఈ తైలం తయారీలో ఉపయోగించే భృంగా, ఆమలక, యష్టిమూలికలకు శరీరంలోని జీవకణాల మాలిన్యాలను బయటికి పంపించే 'యాంటీ ఆక్సిడెంట్'' గుణాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఈ తైలం మెద డుకు, గుండెకు ఎంతో హాయినిస్తుంది. త లకు మర్ధన చేయడం ద్వారా ఈ తైలంలోని ఎక్లిప్టోసపోనిన్, వెడెలోలాక్టోన్, టెర్పెనాయిడ్స్ అనే రసాయనాలు రక్తంలోకి చేరి మెదడు కణాల్లో ఉండే ఒత్తిడిని తొలగిస్తాయి.


              ఫలితంగా గ్రహణ శక్తి, జ్ఙాపక శక్తి పెరుగుతాయి. ఈ ఈ తైలంతో తలకు మర్ధనం చేయడం వల్ల వెంట్రుకలు నల్లగా నిగనిగలాడటానికి అవసరమైన వర్ణరసాయనాలు అంటే టానిన్స్, గాలిక్ యాసిడ్ వంటి బ్లాక్ పిగ్మెంట్స్ అందుతాయి. 
         అంతేగాక అందమైన, ఆరోగ్యవంతమైన జుట్టు కూడా పెరుగుతుంది. భృంగామలక తైలంతో మర్థించినప్పుడు తలపై ఉండే చుండ్రు, చిడుము, కురుపులు, దురదలు తగ్గిపోతాయి. అంటే తల చర్మం పైనగానీ, కేశమూలాల్లోగానీ ఉండే బ్యాక్టీరియా, ఫంగస్ పైన ఈ తైలం ప్రభావం చూపుతుందని అర్థం.
              అలాగే తల వెంట్రుకలు రాలిపోయే (ఎలోపేషియా) సమస్య తొలగిపోతుంది. బట్టతల వచ్చేసినా ఇంకా కేశమూలాలు మిగిలి ఉంటే తిరిగి వెంట్రుకలు పెరిగే అవకాశం ఉంది. ఇందుకు ఉసిరిలోని గాలిక్ యాసిడ్స్, భృంగాలోని సపోనిన్స్, యష్టిమధులోని స్టిరాల్స్ అనే రసాయనాలు ఉపకరిస్తాయి.


  •  పార్శ్వపు నొప్పి (మైగ్రేయిన్/హెమిక్రేనియా) ఉదయం వేళ భోజనానికి ముందు ఆయుర్వేద వైద్యుని పర్యవేక్షణలో నస్యకర్మ చేయించుకోవచ్చు. ముక్కులో 5 తైలపు చుక్కలు వేయడం ద్వారా ఈ చికిత్స చేస్తారు.
  •   మూర్ఛవ్యాధి ఉన్నప్పుడు కూడా ఆయుర్వే వైద్య నిపుణుని పర్యవేక్షణలో సస్య కర్మతో ఎంతో ప్రయోజనం ఉటుంది. ఉదయం భోజనానికి ముందు ముక్కులో 10 తైలం చుక్కలు వేయడం ద్వారా ఈ చికిత్స చేస్తారు.
  • నిద్ర సరిగా పట్టనప్పుడు తలకుగానీ, పాదాలకు గానీ, లేదా రెండింటికి గానీ, ఈ తైలంతో మర్ధన చేయిస్తే సుఖంగా నిద్రపడుతుంది.
  •   తలకు, పాదాలకు ఈ తైలంతో మర్ధన చేయడం ద్వారా దృష్టిలోపాలు తగ్గే అవకాశం ఉంది.
  •   ఎండలో తిరిగే వారు ముందే ఈ తైలాన్ని తలకు మర్ధన చేసుకుంటే వడదెబ్బ బారిన పడే ప్రమాదం తప్పుతుంది.
  •   జుత్తు రాలిపోతున్న కారణంగా భృంగామలక తైలంతో తైలమర్ధన చేసుకోవడం వల్ల ప్రయోజనమైతే ఉంటుంది. అయితే అదే సమయంలో గానీ, అంతకన్నా ముందేగానీ మనలో ఇతర లోపాల నివారణలోనూ శ్రద్ధ వహించాలి. వాటిలో ముఖ్యంగా ఇనుము లోపాలు అంటే రక్తహీనత లేకుండా చూసుకోవాలి.


అలాగే ప్రొటీన్ లోపాలు కూడా లేకుండా చూసుకోవాలి. నిజానికి రక్తహీనత, ప్రొటీన్ లోపాల కారణంగా కూడా చాలా మందికి జుత్తు రాలుతూ ఉంటుంది. రక్తహీనత తగ్గడానికి ఇనుము ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు ముఖ్యంగా ఆకుకూరలు విరివిగా తీసుకోవాలి. ప్రొటీన్ కోసం మాంసాహారం గానీ లేదా మొలకెత్తిన గింజలు, బాదం, జీడిపప్పు, వేరుచెనిగల్లాంటివి బాగా తీసుకోవాలి.

         అయితే బలవర్ధకమైన ఆహారం తీసుకుంటున్నా అవి పూర్తిగా జీర్ణమై ఒంటపట్టడానికి అవసరమైన వ్యాయామాలు కూడా చేయాలి. వీటితో పాటు మలబద్ధకం లేకుండా చూసుకోవడం, తలకు రక్తప్రసరణ పెరిగేందుకు తోడ్పడే ఆసనాలు కూడా ముఖ్యమే. నిద్రలేమితో కూడా కొందరికి జుత్తు రాలిపోయే అవకాశం ఉంది. రోజూ కనీసం 7 గంటల నిద్ర అవసరమన్న విషయాన్ని మరిచిపోకూడదు.

          ఇకపోతే, సలసలా కాగే నీటితో తలస్నానం చేయడం, తలకింద మరీ ఎత్తయిన దిండు పెట్టుకోవడం వంటివి కూడా జుత్తు రాలిపోవడానికి దారి తీయవచ్చు. అందుకే ఈ అలవాట్లను మానుకోవాలి. శిరోజాల పరిరక్షణ ఆహారపు అలవాట్లతో పాటు జీవన శైలి మీద కూడా ఆధారపడి ఉంటుంది.



               తరుచూ, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాదుల బారిన పడటం క్షయ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు గురైన వారిలో కూడా జత్తు రాలిపోయే ప్రమాదం ఉంది. ముందు ఆ వ్యాధులనుంచి బయటపడితే గానీ, జుత్తు మళ్లీ పెరిగే అవకాశం లేదు. అందుకే తైల మర్థనలతో పాటు ఇతర సమస్యల నివారణకోసం కూడా శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top