కార్తీక స్నానమెందుకు ?

కార్తీక స్నానమెందుకు ?

    ఈ  మాసంలో సూర్యోదయానికి ముందు స్నానం చేస్తే ఆయురారోగ్యాలు కలుగుతాయి. మెడ వరకూ నీటిలో ఉండి స్నానం చేయటం ద్వారా ఉదర వ్యాదులు నయమవుతాయి.

      కార్తీక స్నాన విషయం లో  ఓ ఆరోగ్య సూత్రం కూడా ఉంది. వర్షా కాలం లో పడిన నీరు భూమి లోకి ఇంకి బలమైన అయస్కాంత మండలం ఏర్పడుతుంది. 

      వర్ష కాలం తర్వాత వచ్చే కార్తీక మాసం లో ప్రవహించే నదుల్లో అయస్కాంత శక్తి అపారంగా ఉంటుంది. దాని వల్లే కార్తీక మాసంలో నదీ స్నానమూ, సముద్ర స్నానమూ, చేయమంటారు. హరి హారాదులకు ప్రితికరమైన మాసం కార్తీక మాసము. 

      ఈ మాసములో నదీసముద్ర  స్నానమూ, దీపారాధన ఎంతో పవిత్రము. పురుగులూ, మిదతలూ, చెట్లు , పక్షులూ ఇలా అనేక జీవులు కార్తీక దీపాన్ని చూసి తమ జన్మరాహిత్యాన్ని పొందుతాయి. 

యీ క్రింది శ్లోకమును చదివి మరీ స్నానమాచరించవలెను.
 
గంగే యమునే చైవ గోదావరి సరస్వతీ
           నర్మదా సింధు కావేరీ జలేస్మిన్‌ సన్నిధింకురు!!Share on Google Plus