Telugu Funny Jokes - 9

పిసినారి నెం.1

"అనాథాశ్రమం కోసం ఎంతటి పిసినారివాడైనా జాలి పడి తమకు తోచిన సహాయం చేస్తాడని కదటోయ్ వెళ్లావు ... ఇంతకీ ఆ భజగోవిందం ఏమిస్తానన్నాడేఁ?'' అడిగాడు పాపారావు.
"అనాథాశ్రమం పూర్తికాగానే కబురు చేస్తే వాళ్ల నలుగురు పిల్లల్ని పంపిస్తానన్నాడోయ్'' మొహం వేలాడేస్తూ చెప్పాడు అప్పారావు.

అందుకే ప్రాణాలర్పించాం!

జోగినాథం, రామనాథం సిటీ పొలిమేరల్లో ఉన్న ఒక శ్మశానంలో కూర్చుని తీరిగ్గా కబుర్లాడుకుంటున్నారు.
"ఈ గోరీలన్నీ ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నాయో చూడోయ్ జోగినాథం. వీటికున్న హాయి మనకు లేదోయ్...''
"మరేఁ ... అదృష్టం అంటే చచ్చినోళ్లదే సుమండీ'' వత్తాసు పలికాడు రామనాథం.
"ఈ ప్రశాంతత కోసమే కదా మా జీవితాల్ని పణంగా పెట్టి ఇక్కడకి వచ్చాం మరి'' వెంటనే గాల్లోంచి విన్పించాయి మాటలు.
పెళ్లి కానుక

కొత్తగా మార్కెట్లోకి వచ్చిన 'దిల్‌దియా' సెల్ కంపెనీ వారు, వాళ్ల ఫోన్‌లో పెళ్లి సమాచారం తెలియజేసే ఒక సదుపాయాన్ని కల్పించారు.
"పెళ్లిచూపుల వివరాలకు 1 నొక్కండి, ఎంగేజ్‌మెంట్ కోసం 2 నొక్కండి, పెళ్లి కోసం 3 నొక్కండి ... ఇంకా ఏమైనా వివరాలు కావాలంటే 4 నొక్కండి ...''
గంగరాజు వెంటనే 4 నొక్కి "మళ్లీ పెళ్లి కావాలంటే ఏం నొక్కమంటారూ?'' ఆత్రంగా అడిగేడు.
"మీ ఆవిడ పీక నొక్కండి'' జవాబుతో పాటు బీప్ శబ్దం వినిపించింది.
తేడా?

"ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాడిని హిందీలో ఏమంటారో ఒక్క మాటలో చెప్పండి?''
""Hus mukh''
"నవ్వించినా నవ్వని వాడిని?''
"Hus band''
 

సరికి సరి!

"అన్ని కరెన్సీ నోట్ల మీదా గాంధీ తాత నవ్వుతూ ఉంటాడెందుకురా?'' అడిగాడు చింటూ.
"ఏడిస్తే అవి తడిసిపోతాయి గనక'' చెప్పాడు బంటీ.
గీతపై చేయేసి ...

కోర్టులో ముద్దాయిగా నిలబడ్డాడు పల్లెటూరి పరమాత్మ.
"గీతపై చేయేసి అంతా నిజమే చెబుతాను అని చెప్పండి'' అన్నాడు న్యాయవాది.
"ఇదెక్కడి తంటా లాయరుబాబూ ... సీతపై చెయ్యి వేసినందుకే కదా ... నన్ను బొక్కలో తోసి కుళ్లబొడిసింది. మళ్లీ గీతపై చెయ్యేయమంటారేంటి?'' గొల్లుమన్నాడు పరమాత్మ.   

సంజీవని దొరకలే...

సెంట్రీ: నిన్న రాత్రి జైల్లో ఖైదీలందరూ ‘‘హనుమాన్‌చరిత్ర’’ నాటకం వేశారు సార్.
జైలర్(సంతోషంగా): వెరీగుడ్. మన ఖైదీలందరిలో ఆధ్యాత్మిక భావన, మంచితనం అలవడుతున్నాయన్నమాట. మరి నువ్వేంటి అలా ఉన్నావు ?
సెంట్రీ: సార్! నిన్న హనుమంతుడి వేషం వేసినవాడు సంజీవని పర్వతం తీసుకురావటానికి వెళ్ళి ఇప్పటివరకూ రాలేదు సార్.
జైలర్: ఆఁ!?!
    





block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top