ఇలా చేస్తే... మీ చీరలు పదిలం


భారతీయ స్ర్తీల వస్తధ్రారణ విషయంలో ఎప్పటి ికైనా... చీరలదే అగ్రస్థానం. ఎన్ని రకాల పాశ్చాత్య ఫ్యాషన్లు వెల్లువెత్తినా... చీరల ముందు అవి దిగదుడుపే. మహిళకు చీర కట్టులో ఉన్న అందం మరే వస్తధ్రా రణలోనూ కానరాదు. రోజువారీ కట్టే చీరలే కాకుండా...పెళ్ళిళ్ళకు, ఫంక్ష న్లకు ఖరీదెైన చీరల్ని కూడా సమకూర్చు కుంటారు మహిళలు. వీటిలో కంచిపట్టు, జరీ, ఎంబ్రాయిడరీ, పార్టీవేర్‌... ఇలా ఎన్నో రకాల చీరలు కొంటూవుంటారు. మరి ఎంతో ఇష్టంగా కొనుక్కున్న ఈ చీరలు అంతే పదిలంగా కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది కదా..! దానికోసం ఏం చేయాలి? చీరలు పదికాలాల పాటు మన్నికగా ఉండాలంటే... ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. ఈ కింది సూచనలు తు.చ తప్పకుండా పాటిస్తే... సరి!! 

  • కొనే ప్రతి చీరకూ ఫాల్‌ కుట్టించడం తప్పనిసరి.

  • చీరలు కొనేటప్పుడు ఉతికే విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని తెలుసుకోవాలి. డ్రైక్లీన్‌ మాత్రమే అని రాసి ఉండే... చీరల్ని డ్రైక్లీనింగ్‌ ఇవ్వడం తప్పనిసరి.

  • మరకలు పడితే... వెంటనే ఆ ప్రాంతాన్ని నీటితో కడిగేయాలి. ఒకవేళ అది జిడ్డు మరకైతే... టాల్కమ్‌ పౌడర్‌ తగినతంత చల్లండి. పౌడర్‌ జిడ్డును పీల్చేస్తుంది.ఆ తరువాత డ్రైక్లీనింగ్‌కు ఇవ్వాలి.

  • ఇస్ర్తీ చేస్తున్నప్పుడు వేడి తగిన మోతాదు మేరకే ఉండాలి సుమా... అన్ని రకాల చీరల్ని సూటిగా ఇస్ర్తీ పెట్టెతో రుద్దేయకూడదు. నాజూగ్గా ఉండే సిల్క్‌, ఎంబ్రాయిడరీ చీరలకు మధ్యలో వేరే కాటన్‌ వస్త్రం ఉంచి, తక్కువ వేడితో ఇస్ర్తీ చేయాలి.

  • మూడు నెలలకొకసారి చీరలను కాసేపు ధారాళంగా గాలి వచ్చే చోట ఆరేయాలి. ఆ తరువాత మడతపెట్టాలి. మడతల్లో చిరగకుండా ఉండాలంటే మార్చి మార్చి మడతేయడం మంచిది.

  • సిల్క్‌ చీరల మధ్యలో నాఫ్తాలిన్‌ ఉండలను ఉంచకూడదు. వాటి బదులు గంధం పొడిసంచులను (శాండల్‌ పౌచెస్‌) లేదా పలుచని వస్త్రంలో మూటకట్టిన ఎండు వేపాకును గాని ఉంచడం మంచిది.

  • చీరలను చల్లని, పొడి ప్రదేశంలో భద్రపరచాలి. అన్నిరకాల చీరలను వార్డ్‌రోబ్‌లో అలాగే సర్దేయకుండా...తరుచూ వాడే చీరలను హ్యాంగర్లకు తగిలించండి.

  • ఎంబ్రాయిడరీ చీరల్ని, పట్టు చీరల్ని హ్యాంగర్లకు వేలాడదీయకూడదు. వీటిని విడివిడిగా మృదువెైన కాటన్‌, మల్‌మల్‌ వస్త్రంలో చుట్టిపెట్టడం మంచిది. ముఖ్యంగా హెవీ సిల్క్‌‌స, జరీ వర్క్‌ చేసిన చీరల విషయంలో ఈ జాగ్రత్త తప్పనిసరి. అలా చేస్తే ఒక చీర దారాలు మరోచీరకు పట్టుకొని పాడెైపోవడం ఉండదు. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top