తిరుమల శ్రీ వేంకటేశ్వరుని బంగారు గోపురం పై విమాన వెంకటేశ్వరస్వామి ఎవరి కోసము?

తిరుమల  శ్రీ వేంకటేశ్వరుని బంగారు గోపురం పై విమాన వెంకటేశ్వరస్వామి ఎవరి కోసము?

కలియుగ  వైకుంఠమైన తిరుమలలో  శ్రీ వెంకటేశ్వర స్వామి  వెలసి ఉన్న స్థానంలో బంగారు గోపురం పైన వెండి ద్వారం లో కొలువై శ్రీ వెంకటేశ్వర స్వామి  ఉంటారు. (వెండి ద్వారం గోపురం పైనున్న స్వామి ప్రదేశాన్ని చూపేందుకు ) దర్శనం అయ్యాక చాలా మంది గోపురం పైన ఉన్న స్వామి ని చూసి దర్శించి నమస్కరిస్తుంటారు.  

              వాయువ్య దిశలో ఉన్న ఈ స్వామిని విమాన వెంకటేశ్వర స్వామి అని కూడా  అంటారు. మహా విష్ణువు ఆనతి తో గరుత్మంతుడు వైకుంటం నుంచి ఈ విమాన వేంకటేశ్వరుని తీసుకొచ్చాడు.

              ఆ దర్శనం పశు పక్షాదుల కోసము, దేవతల కోసము. ఆకాశాన్నించి  ముక్కోటి దేవతలు దిగి వచ్చి స్వామిని సేవించుకోవటం కోసమే.

              మన పగలూ, రాత్రితో వారికి సంబందం లేదు. గనుక వారి పూజా సమయం వేరు గనుక, భూమి క్రిందున్న, భుమిపైనున్న అన్ని లోకాల వారికి ఇచ్చే దర్శనమే అది.

            తిరుమల వెళ్ళిన వారు తప్పక విమాన వెంకటేస్వరుడ్ని, స్వామి పాదాలనూ దర్శించి తరించండి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top