కుక్కపిల్ల ధర రూ.8 కోట్లు తెలుసా..?


లక్షల రూపాయలు ధర పలికే శునకాలను టీవీలో చాలా చూసే ఉంటారు. కానీ, ఇంత ధర పలికిన కుక్క ప్రపంచంలో మరొక్కటి లేదంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇంతకూ ఈ ఎర్రబొచ్చు కుక్కపిల్ల ధర ఎంతో తెలుసా..? అక్షరాలా ఎనిమిది కోట్ల రూపాయలు. ఈ మధ్యనే ఒక చైనా బొ గ్గు గనుల యజమాని ఈ కుక్కను కొన్నారు. ఇన్ని కోట్లు పెట్టి కొనుక్కున్న ఈ శునకం ప్రత్యేకత అంతా ఇంతా కాదు. ప్రపంచంలోనే అత్యంత పురాతన జాతికి చెందిన ఇలాంటి శునకాలు.. గౌతమబుద్ధుడు, చెంఘిజ్‌ఖాన్, క్వీన్ విక్టోరియా, కింగ్‌జార్జి-4 ల దగ్గర మాత్రమే ఉండేవట.

అంతరించిపోయిన ఈ జాతి శునకాన్ని పునఃసృష్టించేందుకు ఒకాయన కంపెనీ పెట్టి కోట్లు ఖర్చు పెట్టాడు. కొన్నేళ్లు కష్టపడి పరిశోధనలు చేస్తే కానీ, ఈ రెడ్ పప్పీ పుట్టలేదు. "నేను మొదట్లో ఇంత ఖరీదైన కుక్కను కొనాలనుకోలేదు. అయితే, దీన్ని సృష్టించేందుకు ఆయన శ్రమతోపాటు పెద్దమొత్తాన్ని ఖర్చు చేశాడు. అంతరించిపోయిన ఈ జాతి శునకాన్ని ఆయన మళ్లీ బతికించడమే అద్భుతం. ఇలాంటి పరిశోధకులకు కాస్త ప్రోత్సాహం ఇవ్వాలనే ఎనిమిది కోట్లు పెట్టి కొనాల్సి వచ్చింది..'' అన్నాడు ఆ యజమాని. దాని వయస్సు 11 ఏళ్లట. రెడ్ టిబెటన్ మస్తిఫ్ జాతికి చెందిన ఈ శునకం ఇంట్లో తిరుగుతుంటే ఆరోగ్యంతోపాటు ఐశ్వర్యం కూడా సిద్ధిస్తుందని టిబెటన్లు విశ్వసిస్తారు. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top