కొంగుముడులు


కావల్సినవి: 
మైదాపిండి- పావుకేజీ, పంచదార, బెల్లం- 150గ్రాముల చొప్పున, ఉప్పు- చిటికెడు, నూనె- వేయించడానికి సరిపడా
తయారీ: 

రెండు చెంచాల నూనె వేడి చేసి మైదాపిండిలో కలపాలి. ఉప్పు, కాసిని నీళ్లు చేర్చి గులాబ్‌జామూన్‌ పిండిలా గట్టిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. పావుగంటయ్యాక పిండిని కాస్త ఎక్కువగానే తీసుకొని పెద్ద పరిమాణంలో పూరీలా ఒత్తుకోవాలి. తరవాత అర అంగుళం పొడవులో రిబ్బన్‌లా పొడవుగా కోసుకోవాలి.

ఇలా ఐదు రిబ్బన్లను కలుపుతూ మధ్యలో ముడి వేయాలి. ఇలా చేసిన వాటిని నూనెలో వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గిన్నెలో పంచదార, బెల్లం వేసి కాసిని నీళ్లు పోసి ముదురు పాకం పట్టాలి. పాకంలో వేయించిన ముడులను వేసి పళ్లెంలో అలంకరించుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన కొంగుముడులు సిద్ధమయినట్టే.  

ప్రియమైన వారికి.. చేసి పెడితే ప్రశంసలు పొందడం ఖాయం. 
Share on Google Plus