కావల్సినవి:
మెంతికూర కట్టలు- రెండు, పెద్దఉల్లిపాయ- ఒకటి(తరగాలి), టమాటాలు- మూడు(సన్నగా తరగాలి), అల్లం వెల్లుల్లి ముద్ద- చెంచా, అన్నం- రెండు కప్పులు, కరివేపాకు- నాలుగురెబ్బలు, జీలకర్ర- చెంచా, జీడిపప్పు- పది, గరం మసాలా- చెంచా, ఉప్పు- తగినంత, కొత్తిమీర- కట్ట, నూనె- రెండుచెంచాలు.
తయారీ:
మెంతికూరను శుభ్రంగా కడిగి.. తరిగి పక్కన పెట్టుకోవాలి. మందపాటి గిన్నెలో నూనె వేసి కాగాక జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి బాగా వేయించాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద, గరంమసాలా, టమాటా ముక్కలు వేసి కొద్దిసేపు ఉడికించాలి. తరవాత మెంతికూర తరుగు చేర్చి మూత పెట్టాలి. కూరలో నీరంతా ఇంకిపోయాక అన్నం, ఉప్పు జోడించి సన్నటి మంట ఉంచాలి. ఐదు నిమిషాలయ్యాక జీడిపప్పు, కరివేపాకు, కొత్తిమీరతో అలంకరించి దించేస్తే సరిపోతుంది.