పనీర్‌ పాలకూర బాల్స్‌


కావల్సినవి: 
బ్రెడ్‌ ముక్కలు- పది, పాలకూర- కట్ట, అల్లం పచ్చిమిర్చి ముద్ద- అరచెంచా వెల్లుల్లి ముద్ద- అరచెంచా, గరంమసాలా- అరచెంచా, నిమ్మరసం- చెక్క, ఉప్పు- రుచికి తగినంత, పనీర్‌- నూటయాభై గ్రాములు.
మారినేషన్‌ కోసం: 
నిమ్మరసం- చెంచా, అల్లం పచ్చిమిర్చి ముద్ద- అరచెంచా, వెల్లుల్లి ముద్ద- అరచెంచా, మిరియాల పొడి- పావుచెంచా, మొక్కజొన్నపిండి- తగినంత, నూనె- వేయించడానికి
తయారీ: 
మొక్కజొన్న పిండి, నూనె కాకుండా మిగతా మారినేషన్‌ పదార్థాలు, పనీర్‌ను గిన్నెలోకి తీసుకొని కలిపి పెట్టుకోవాలి. తరవాత పాలకూరను శుభ్రంగా కడిగి.. సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు బ్రెడ్‌ ముక్కల చివర్లు తీసేసి అందులో అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి ముద్ద, గరంమసాలా, ఉప్పు, నిమ్మరసం అన్ని కలిపి పెట్టుకోవాలి. అందులో పాలకూర తరుగు, మారినేట్‌ చేసిన పనీర్‌ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా చేర్చుతూ బాగా కలపాలి. బాణలిలో నూనె పోసి పొయ్యి మీద పెట్టాలి. వేడయ్యాక మిశ్రమాన్ని ఉండల్లా చేసుకొని వేయించుకోవాలి. బాగా వేగాక దించేస్తే పనీర్‌ పాలకూర బాల్స్‌ సిద్ధమయినట్టే. వీటిని చల్లటి సాయంత్రం వేళ టమాటా సాస్‌తో కలిపి తింటే బాగుంటాయి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top