పండ్లతో ఫేషియల్స్‌

సహజసిద్ధంగాలభించే పండ్లు సౌందర్య స్ద్ద్ద్దంరక్షణలో మేలుచేస్తాయి కానీ.. వాటిని నేరుగా వాడితే మాత్రం అనుకున్నంత ఫలితం రాకపోవచ్చు. ఫ్రూట్‌ఫేషియల్స్‌ను కేవలం పండ్లరసాలు, గుజ్జులతోనే తయారుచేయరు. ఇతర క్రీంలలో కలిపి వాడతారు. పండ్లతో చేసిన సీరమ్‌లు కూడా ఉంటాయి. అలాంటివి వాడితేనే అనుకున్న ఫలితం లభిస్తుంది. అంతేకానీ పండ్లగుజ్జు లేదా రసం రాసుకోవడం వల్ల అనుకున్నంత మెరుపు రాదు. అప్పటికప్పుడు మెరుపు కావాలనుకుంటే.....మరికొన్ని పదార్థాలు కలిపి పూతలు వేసుకోవాల్సి ఉంటుంది.
  • అరటిపండును చక్రాల్లా కోసి తేనెలో ముంచి ముఖంపై రెండునిమిషాలు మృదువుగా రుద్దాలి. పదినిమిషాలయ్యాక కడిగేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. 
  • అలాగే గట్టి మీగడను తీసుకుని దాంట్లో కొన్ని చుక్కల ద్రాక్ష రసం కలిపి ముఖానికి మర్దన చేసుకుంటే.. పొడిబారిన చర్మం మృదువుగా, ప్రకాశవంతంగా మారుతుంది.
  • జిడ్డు చర్మతత్వం ఉన్నవాళ్లు కమలాఫలం లేదా బత్తాయిరసం చెంచా తీసుకుని అదే మోతాదులో ముల్తానీమట్టి, పావుచెంచా తేనె కలిపి ప్యాక్‌లా వేసుకోవాలి. జిడ్డు తగ్గి..తాజాగా మారుతుంది.
ఇలా ప్రయత్నించాలి కానీ.. నేరుగా రాసుకోవడం వల్ల చర్మ కణాలు దెబ్బతింటాయి. ఎక్కువసేపు మర్దన చేయకూడదు. పండ్లలోని సుగుణాలన్నీ చర్మంలోకి వెళ్లాలంటే నిపుణుల పర్యవేక్షణలో ప్రత్యేక చికిత్స చేయించుకోవాలి.
Share on Google Plus