బ్యాంకు ఖాతాలు లేని వారికి ఇదో శుభవార్త. మొబైల్ మనీ ట్రాన్స్‌ఫర్

బ్యాంకు ఖాతాలు లేని వారికి ఇదో శుభవార్త. దేశంలో 30 కోట్ల మందికి బ్యాంకు ఖాతాలు లేవు. కాని 90 కోట్ల మందికి మొబైల్స్ ఫోన్‌లు ఉన్నాయి. దీన్ని ఆధారంగా చేసుకొని డబ్బును దాచుకోవటంతోపాటు డబ్బును బదిలీ చేసేందుకు వీలుగా మొబైల్ మనీ ట్రాన్స్‌ఫర్ విధానం ఇటీవల అందుబాటులోకి వచ్చింది. రోజువారీ కూలీలు, చిన్న చిన్న వ్యాపారులు, కార్మికులు తమ సంపాదించిన మొత్తాలను ఇకనుంచి బ్యాంకు ఖాతా లేకుండానే మొబైల్ నెంబరు సాయంతో ఖాతా తెరచి డబ్బును దాచుకోవచ్చు.


వంద రూపాయల నుంచి యాభైవేల రూపాయల దాకా డబ్బును ఈ మొబైల్ అవుట్‌లెట్లలో అధీకృత ఏజెంట్ల వద్ద దాచుకోవచ్చు. దీన్ని డిజిటల్ ప్రీపెయిడ్ మొబైల్ బ్యాంకు ఖాతాలు అంటారు. హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో అందుబాటులోకి వచ్చిన ఈ మొబైల్ మనీ ట్రాన్స్‌ఫర్ సేవలు త్వరలో రాష్ట్రం అంతా అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం నోకియా మనీ, ఎయిర్‌టెల్ మనీ ట్రాన్స్‌ఫర్‌ల పేరిట సేవలు అందుబాటులో ఉన్నాయి.

ఈ మొబైల్ మనీ ఖాతాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని ఆటోడ్రైవర్లు, కూలీలు చెపుతున్నారు. మొబైల్ మనీ రిటైలర్ వద్దకు వెళ్లి డబ్బును దాచుకోవటంతోపాటు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ ఖాతాదారులకు ఏటీఎం కార్డులు కూడా జారీ చేశారు. మనీ ట్రాన్స్‌ఫర్‌లపై మూడు శాతం కమీషన్ తీసుకుంటున్నారు. కేవలం ఒక్క ఎస్ఎంఎస్ ద్వారా మనీని విత్‌డ్రా చేసుకునే, ట్రాన్స్‌ఫర్ చేసుకునే సౌలభ్యం
ఉంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top