ఒత్తిడి(టెన్ష్‌న్) నుంచి సులభంగా బయటపడేందుకు కొన్ని ఇన్‌స్టంట్ చిట్కాలు

రోజు వారీ జీవితంలో మానసిక ఒత్తిడి ఎదుర్కోని వారు ఉండరు. ఇంటి నుంచి బయటపడినప్పటి నుండి తిరిగి ఇంటికి చేరేవరకు అంతా టెన్ష్‌న్..టెన్షనే. రోడ్డుపైన ట్రాఫిక్‌ను ఛేదించుకుని ఆఫీసుకు వెళ్లేంతవరకు ఒక పరిస్థితి..ఆఫీసులో పనిఒత్తిడి మరో పరిస్థితి. ఈ ఒత్తిడి నుంచి సులభంగా బయటపడేందుకు కొన్ని ఇన్‌స్టంట్ చిట్కాలను మానసిక నిపుణులు సూచిస్తున్నారు. 

*మీరు చేయాల్సిన పనుల జాబితా చేంతాడంత ఉంటే కొద్దిసేపు వాటిని పక్కనపెట్టండి. వేడి వేడి పాలు తాగండి. మనసును ఉల్లాసపరిచే సెరోటోనిన్ హార్మోన్‌కు ఉద్దీపనంలా పాలు పనిచేస్తాయి. దీంతో టెన్షన్ తగ్గుతుంది.
పని ఒత్తిడితో సతమతమవుతున్నారా? అయితే కొద్దిగా రిలాక్స్ కావలసిందే. ఓ పావుగంట పనికి బ్రేక్ ఇచ్చి పచార్లు చేయడమో, తేలికపాటి వ్యాయామాలో చేయండి. మీ టెన్షన్ దూరమవుతుంది. జుఆఫీసులో బాగా టెన్షన్‌గా ఉంటే చెవులకు ఇయర్‌ఫోన్స్ తగిలించుకుని కొద్దిసేపు సంగీతం వినండి. ఒత్తిడిని ప్రేరేపించే కార్టిసాల్ హార్మోన్‌కు సంగీతం దివ్యౌషధంలా పనిచేస్తుంది. జుఒత్తిడి ఫీలవుతే మీకు తెలిసీ తెలియని భాషలో 10 అంకెలు లెక్కపెట్టడానికి ప్రయత్నించండి. దీనివల్ల ధ్యాస మళ్లి ఒత్తిడి నుంచి బయటపడుతారు.

*టేబుల్ మీద గుట్టలుగా పేరుకుపోయిన ఫైళ్లను చూస్తే తాము చేయాల్సిన పని గుర్తొచ్చి ఉద్యోగులకు టెన్షన్ పెరిగిపోతుంది. అందుకే చేస్తున్న పనికి సంబంధించిన ఫైల్సు మాత్రమే టేబుల్ మీద ఉంచుకోవాలి. జుకష్టమనిపించినా సరే ఆఫీసులో ఆలస్యమైనా పని పూర్తి చేసే వెళ్లాలి. ఇంటికి తీసుకువెళ్లి పెండింగ్ పని పూర్తిచేయడానికి ప్రయత్నించకూడదు. దీని వల్ల హృద్రోగాలు వచ్చే అవకాశం 20 రెట్లు ఎక్కువగా ఉంటుందని వైద్య పరిశోధనలు చెబుతున్నాయి.

*పని ఒత్తిడి కారణంగా చికాకుగా అనిపిస్తే మీ ఆప్తులకు ఫోన్ చేయండి. మిమ్మల్ని ప్రేమించే వారితో మాట్లాడితే ఎంతటి చిరాకైనా చిటికెలో మాయమవుతుంది. జుఒత్తిడి ఎక్కువగా ఉంటే మీ ఆలోచనలను కాగితం పైన పెట్టండి. మీరు చేయాల్సిన పనుల జాబితా తయారు చేయండి. అందులో అతి ముఖ్యమైన వాటిని టిక్ చేసుకుని ముందు వాటిపై దృష్టి నిలపండి. అలా చేయడం వల్ల చేయవలసిన పనులు తగ్గిపోయినట్లు అనిపించి మనస్సు ప్రశాంతమవుతుంది. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top