ఎప్పుడైనా ఆలూ జ్యూస్ గురించి ఆలోచించారా?

ఎప్పుడైనా ఆలూ జ్యూస్ గురించి ఆలోచించారా? బహుశా ఆలోచించి ఉండరు. అయితే కడుపులో అల్సర్స్‌ను నివారించడానికి ఆలూ జ్యూస్ సమర్థంగా పనిచేస్తుందన్నది మాంఛెస్టర్ యూనివర్సిటీ మైక్రోబయాలజీ విభాగానికి చెందిన పరిశోధకుల మాట. ఆలూ జ్యూస్‌లో ఉండే కొన్ని రసాయనాలు పొట్టలో పెరిగే హానికర బ్యాక్టీరియాను నిరోధిస్తాయట. దాంతో అల్సర్స్‌ను సమర్థంగా నివారించే వీలుందంటున్నారు. ఆలూజ్యూస్ యాంటీబయాటిక్ తరహాలోనే ప్రభా వం చూపినా... ఇక్కడ దీనితో ఒక ప్రయోజనం ఉంది.
యాంటీబయాటిక్స్ వాడటం వల్ల కొన్ని బ్యాక్టీరియా దానికి అలవాటు పడిపోయి డ్రగ్ రెసిస్టాన్స్ సాధించవచ్చు.

కానీ... ఆలూ జ్యూస్ వల్ల అలాంటి దుష్పరిణామం కలిగే అవకాశం లేదు. పైగా దానితో ఎలాంటి దుష్ర్పభావాలు (సైడ్ ఎఫెక్ట్స్) ఉండవు. పొటాటో జ్యూస్‌లో ఈ ప్రయోజనాన్ని కలిగించే ఆ నిర్దిష్ట జీవరసాయనానికి (మాలెక్యూల్‌కు) ఇంకా పేరు పెట్టాల్సి ఉంది. ఈ మాలెక్యూల్‌ను గుర్తించిన పరిశోధకులు ప్రొఫెసర్ ఐయాన్ రాబర్ట్స్ మాట్లాడుతూ ‘‘మొదట పొటాటో జ్యూస్ వల్ల అల్సర్ తగ్గుతుందనే విషయంపై అంతగా నమ్మకం కుదరకపోయినా... వృక్షజాతుల్లోని అనేక రసాయనాల్లో ఎన్నో చికిత్సా ఔషధాలు ఉన్నాయన్న విషయాన్ని గుర్తుచేసుకున్నప్పుడు అదేమీ ఆశ్చర్యంగా అనిపించలేదు’’ అని వ్యాఖ్యానించారు.
  
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top