యాంటీ బ్యాక్టీరియల్ సబ్బే మంచిదా?

మంచి ఆరోగ్యం కోసం చేతులు శుభ్రంగా ఉంచుకునేందుకు లేదా స్నానానికి యాంటీబ్యాక్టీరియల్ సబ్బే మంచిదా? టీవీలో వచ్చే అడ్వర్టైజ్‌మెంట్స్ చూసి మోసపోకండి. మనం మన వ్యక్తిగత పరిశుభ్రత (పర్సనల్ హైజీన్) పాటించడం కోసం తప్పనిసరిగా యాంటీబ్యాక్టీరియల్ సబ్బునే వాడాల్సిన అవసరం లేదు. ఆ మాటకొస్తే ఏ సబ్బయినా ఒకటే అంటున్నారు పరిశోధకులు.

‘సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్’ పేర్కొంటున్న దాని ప్రకారం చేతులు కడుక్కునే సమయంలో సబ్బు రాసుకున్న తర్వాత కనీసం 15 సెకన్ల పాటు రెండు చేతులనూ శ్రద్ధగా రుద్దుకోవాలి. ఇలా చేయడం వల్ల చేతులపై ఉన్న బ్యాక్టీరియా సంఖ్య తగ్గిపోవడమే కాక, చేతులు కూడా శుభ్రపడతాయి. కేవలం యాంటీబ్యాక్టీరియల్ సబ్బు ఉపయోగించినంత మాత్రాన అది బ్యాక్టీరియాను తొలగించి శుభ్రపరుస్తుందనుకోవడం పొరపాటేనంటున్నారు నిపుణులు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top