చాలాసేపు నిద్రపోయినా... ఇంకా నిద్రసరిపోవడం లేదా...?

కొందరు దాదాపు పది గంటల పాటు నిద్రపోతారు. అయినా పగటివేళ జోగుతూ కనిపిస్తారు. ఎంతసేపు నిద్రపోయినా నిద్ర సరిపోవడంలేదన్నది వాళ్ల ఫిర్యాదు. మీరూ అలా భావిస్తుంటే చేయాల్సిందేమిటో తెలుసా... నిద్రసరిపోనందుకు మరింతసేపు నిద్రపోవడం కాదు... మీరు చేయాల్సిందల్లా కాస్తంత త్వరగా నిద్రలేవడం! ఆశ్చర్యంగా ఉందా? అవును. మీరు పదిగంటలు పడుకున్న తర్వాత కూడా నిద్ర వస్తోందంటే మీకు నిద్ర ఎక్కువై మత్తుగా ఉంటుందేమో చూసుకోవాలి. ఎందుకంటే... అవసరమైన సమయం కంటే ఎక్కువగా నిద్రపోవడమనే పని చేస్తుంటే దానికీ ఎక్కువ శక్తి వెచ్చించాల్సి ఉంటుందట.

ఎక్కువ ఎనర్జీ అవసరమట. ఆ అదనపు శక్తిని నిద్రకు వెచ్చిస్తుండటంతోనే మళ్లీ నిద్రవస్తున్నట్లు అనిపిస్తుందట. అందుకే దాదాపు తొమ్మిది లేదా పది గంటల కంటే ఎక్కువసేపు పడుకున్న తర్వాత కూడా నిద్ర వస్తున్నట్లు అనిపిస్తుండేవారు చేయాల్సిందల్లా... ఏడెనిమిది గంటలు పడుకున్న తర్వాత ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ పడుకోకూడదు. ఖచ్చితంగా నిద్ర లేవాల్సిందే. అప్పుడు రోజంతా చురుగ్గా ఉండటం సాధ్యమవుతుందంటున్నారు వైద్యనిపుణులు.
Share on Google Plus