పొడి దగ్గు తగ్గాలంటే?

వెైరస్‌, బ్యాక్టీరియా, ఫంగస్‌, పరాన్న జీవుల వలన కలిగిన ఇన్‌ఫెక్షన్‌ మొదట పొడి దగ్గుతోనే ఆరంభమై బాధిస్తుంటుంది. గొంతు, ముక్కులో ప్రారంభమైన ఇన్‌ఫెక్షన్‌, ఊపిరితిత్తుల వరకూ ప్రయాణించి, శ్వాసమా ర్గాల లోపల ఉండే ‘మ్యూకోసా’ పొరను దెబ్బ తిస్తాయి. ఫలితంగా పొడిదగ్గు మొదలెై సతాయిస్తుంది. సాధారణంగా ఏ దగ్గు అయినా, వారం రోజులలో తగ్గాలి. వారం దాటినా పొడి దగ్గు వేధిస్తుంటే మాత్రం ప్రమాదకరమైన సమస్య ఉన్నదని భావించి జాగ్రత్తపడాలి, దగ్గుతోపాటు జ్వరం, తలనొప్పి, ఆయాసం ఉంటే రక్తపరీక్ష, ఊపిరితిత్తుల ఎక్స్‌రే, శ్వాసకోశాల పరీక్ష చేయించుకోవాలి.

జాగ్రత్తలు:
  • వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు వెంటనే డాక్టరును సంప్రదించాలి, చల్లటి పదార్థాలు, కూల్‌డ్రింక్స్‌, స్వీట్స్‌ తీసుకోకూడదు. చల్లటి గాలికి వెళ్లే ముందు మాస్క్‌ ధరించాలి.
  • ఆల్కహాలు, పొగతాగే అలవాటు ఉన్న వారు వెంటనే మానేయాలి.
  • బ్రీతింగ్‌, ఎక్సర్‌సైజ్‌, ప్రాణాయామం, యోగ నిత్యం చేయాలి.
    చికిత్స:
    వ్యాధి లక్షణాలను, ఉద్రేక, ఉపశమనాలనీ, వ్యక్తి శరీరతత్వాన్ని దృష్టిలో ఉంచుకొని, చికిత్స చేసిన పొడిదగ్గు నుండి త్వరగా ఉపశమనం పొందవచ్చు.
    మందులు:
    ఎకోనెైట్‌: చలిగాలిలో తిరగటం వలన పొడి దగు వస్తుంది. పొడిదగ్గు భరించలేకుండా ఉండి మంచం మీద వెల్లకిలాపడుకోలేరు. మూడు, నాలుగు దిండ్లు వేసి ఎతుత్గా పడుకోబెట్టాలి. విపరీతమైన దాహం ఉండి, ఎప్పుడూ చల్లటి పానియాలు కోరడం ప్రత్యేక లక్షణాలు.
    ఇపికాక్‌: రాత్రిళ్లు దగ్గు ఎక్కువగా ఉండి, ఛాతిలో గురు గురు శబ్దాలు వస్తుంటాయి. వాంతులు, వికారం ఉంటాయి. వాంతి చేసుకొన్న తర్వాత కూడా, వికారం తగ్గకపోవడం గమనించదగిన లక్షణం. ఈ రోగికి ముక్కులో జిలగా ఉండి, తుమ్ములెక్కువగా వస్తుంటాయి. ఈ రోగులలో సాధారణంగా దప్పిక ఉండదు. ఇటువంటి లక్షణాలు ఉన్న వారికి ఈ మందు తప్పక ఆలోచించదగినది.
    హెపార్‌సల్ప్‌: గొంతులో తీవ్రమైన ఇన్‌ఫెక్షన్‌ ఉండి, పుల్ల అడ్డుపడినట్లుగా అనిపించి, నొప్పిగా ఉంటుంది. ఊపిరితిత్తులలో నిమ్ము ఉండి, పిల్లి కూతలు వస్తాయి. దగ్గుతో పాటుగా జ్వరం ఉంటుంది. ఇటువంటి లక్షణాలు ఉన్న వారికి ఈ మందు తప్పక వాడుకోదగినది.
    స్పాంజియా: గొంతు చీరుకూపోతూ, కంగుకంగుమని దగ్గు ఉంటుంది. దగ్గు వలన గొంతు బొంగురుపోయి, మాట స్పష్టతను కోల్పోతుంది. ఈ లక్షణం ఉన్న రోగులకు, ఈ మందు ఆలోచించదగింది.
    పెై మందులతో పాటు బ్రయోనియా, ఆర్సినిక్‌ ఆల్బ్‌, బెల్లడొనా, రస్‌టాక్స్‌, డల్కమెర, పల్సటెల్లా, ఫాస్పరస్‌, సల్ఫర్‌ వంటి కొన్ని మందులను లక్షణాలను అనుసరించి, డాక్టరు సలహామేరకు వాడి ప్రయోజనం పొందవచ్చు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top