మొటిమలు ఉన్నవారు తీసుకోవలసిన ఆహారం

మొటిమలు అనేవి టినేజిలో ఉన్న ఆడపిల్లలకు నిద్ర లేకుండా చేస్తాయి. ఇవి ముఖారవిందాన్నే కాకుండా ఆరోగ్యం మీద,ఆత్మ విశ్వాసం మీద కూడా ప్రభావం చూపుతాయి. ప్రతి పది మందిలో ఒక్కరు ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారు. మొటిమల సమస్య 16 నుంచి 30 సంవత్సరాల లోపు వయస్సు వారికీ ఎక్కువగా ఉంటుంది. మొటిమలు రావటానికి రకరకాల కారణాలు ఉంటాయి. జిడ్డు చర్మం గల వారిలో ఎక్కువగా కనిపించిన,హోర్మోన్స్ అసమానతలు,ఆహారపు అలవాట్లు దీనికి కారణమని నిపుణులు చెప్పుతున్నారు. విటమిన్ ఎ,బి,సి,ఇ లోపించినప్పుడు ఇవి ఎక్కువగా కన్పిస్తాయని వారు చెప్పుతున్నారు.

* ఆయింట్ మెంట్స్,జేల్స్ అప్లై చేయుట వలన సమస్యను కొంతవరకు మాత్రమే తగ్గించుకోవచ్చు. ఆహారపు అలవాట్లతో వీటిని పూర్తిగా నివారణ చేయవచ్చు.


*నూనె,మసాలా పదార్దాలకు దూరంగా ఉండాలి. వేపుడు కూరల స్థానంలో ఉడికించిన కూరలను తినటం అలవాటు చేసుకోవాలి. ఇవి ఆరోగ్యానికే కాకుండా మొటిమలను నివారించటానికి కూడా దోహదం చేస్తాయి.

* గేదె పాలు కాకుండా సోయా పాలు,దీనితో తయారుచేసిన పెరుగు వంటి వాటిని ఉపయోగించటం మంచిది.

* పైబర్ ఎక్కువగా ఉన్న కూరగాయలను తీసుకోవటం మర్చిపోకూడదు.

* కాఫీ,టీ,సాఫ్ట్ డ్రింక్స్ వంటి వాటిని పూర్తిగా తగ్గించేయాలి.

* రెడ్ మీట్ తీసుకోవటం పూర్తిగా మానివేసి,వాటి స్థానంలో కోడి మాంసం,చేపలను ఆహారంలో చేర్చుకోవాలి.

* ప్రతి రోజు 10 నుండి 12 గ్లాసుల నీటిని తప్పనిసరిగా తీసుకోవటం అలవాటు చేసుకోవాలి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top