దేవిశ్రీ ప్రసాద్ గురించి తెలియని నిజాలు

దేవిశ్రీ ప్రసాద్ అంటే ఎనర్జీ కి మారు పేరుగా చెప్పవచ్చు. దేవిశ్రీ ప్రసాద్ పాటలకు కంపోజ్ చేస్తే ముసలివారు సైతం డాన్స్ చేస్తారనటంలో అతిశయోక్తి లేదు. దేవి శ్రీ ప్రసాద్ తూర్పు గోదావరి జిల్లాలోని వెదురుపాక అనే గ్రామంలో 1979 వ సంవత్సరంలో ఆగస్టు 2 జన్మించాడు. ఆ తర్వాత మద్రాస్ చేరుకున్నాడు.

CLICKHERE : పగిలిన పెదవులకు చిట్కాలు 

దేవి తండ్రి ఒక స్కూల్ టీచర్ మరియు రచయత. దేవి సర్ ఎం వెంకట సుబ్బారావు హైస్కూల్ లో చదివాడు. చుదువుతున్న సమయంలోనే సంగీత, నృత్య కార్యక్రమాలలో అనేక బహుమతులను గెలుచుకున్నాడు. అతను తన మొదటి ఆల్బమ్ 'డాన్స్ పార్టీ' ని బాల సుభ్రమణ్యం కొడుకు చరణ్ తో కలిసి చేసి మ్యూజిక్ కి శ్రీకారం చుట్టాడు. 

Devi sri prasad Unnown facts in telugulifestyle

CLICKHERE : గుడ్డు ఆరోగ్యానికే కాదు....అందానికి కూడా 

సినీ పరిశ్రమకు 'దేవి' సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా హిట్ అవ్వటంతో వరుస అవకాశాలతో బిజీగా మారిపోయాడు. అంతేకాక తన మ్యూజిక్ మాయతో బాక్స్ ఆఫీస్ వద్ద అనేక సినిమా విజయాలకు కారణం అయ్యాడు. ఇళయరాజా కి పెద్ద అభిమాని.

CLICKHERE : వావ్ గ్రీన్ టీ ఎంత మాయ చేస్తుందో తెలుసా?

దేవికి సాగర్ అనే తమ్ముడు ఉన్నాడు. సాగర్ మ్యూజిక్ పనులలో చాలా సహాయం చేస్తాడు. ప్రస్తుతం దేవి హీరోగా ఎంట్రీ ఇవ్వటానికి ప్లాన్ చేస్తున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తానని ప్రకటించాడు. అయితే ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉంది.




block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top