శోభన్ బాబు జీవితం గురించి తెలియని షాకింగ్ నిజాలు

శోభన్ బాబు అసలు పేరు ఉప్పు శోభనా చలపతిరావు. ఒక సామాన్య రైతు కుటుంబంలో జనవరి 14, 1937న జన్మించాడు. ఇతని స్వగ్రామం కృష్ణా జిల్లా చిన నందిగామ. తండ్రి పేరు ఉప్పు సూర్యనారాయణ రావు. 

మైలవరం హైస్కూల్లో చుదువుకొనే రోజుల్లో శోభన్ బాబు నాటకాల అంటే ఎక్కువ ఆసక్తి చూపేవాడు. కాలేజీ రోజుల్లో నాటకాలు వేసేవాడు. ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ చదువును విజయవాడలో పూర్తి చేసాడు.

CLICKHERE : పవర్ స్టార్ ఇంటి గురించి కొన్ని షాకింగ్ నిజాలు
 

డిగ్రీ పూర్తి అయ్యాక శోభన్ బాబు మద్రాసులో లా కోర్సులో చేరాడు. నటన మీద ఉన్న ఆసక్తితో ఉదయం కాలేజీకి వెళ్లి మధ్యాహ్నం స్టూడియోల చుట్టూ తిరిగేవాడు. సమయంలోనే తన పేరును శోభన్ బాబుగా మార్చుకున్నాడు. మొదటిసారిగా 17 సెప్టెంబరున 1959న విడుదల అయిన 'దైవబలం' సినిమాలో చిన్న పాత్రను పోషించాడు. అయితే ఆ సినిమా హిట్ కాలేదు.



ఆ తర్వాత "భక్త శబరి" సినిమాలో ముని కుమారుడుగా నటించాడు. ఆ సినిమా కాస్త హిట్ కావటంతో చిన్న చిన్న పాత్రలు వచ్చేవి. అప్పటికే పెళ్లయి పిల్లలు ఉన్న కారణంగా వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఈ సమయంలో సహాయ పాత్రలు లభించడంలో నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు తనకు ఎంతో సహాయం చేశారని శోభన్ బాబు చెప్పాడు.

CLICKHERE : నోటి దుర్వాసన ఎందుకు వస్తుంది?


1969లో విడుదలయిన మనుషులు మారాలి సిల్వర్ జూబిలీ సినిమా శోభన్ బాబు నట జీవితంలో మైలురాయి అని చెప్పవచ్చు . ఆ సినిమాతో శోభన్ బాబు హీరోగా స్థిరపడ్డాడని చెప్పవచ్చు. ఆ తర్వాత చెల్లెలి కాపురం, దేవాలయం, కళ్యాణ మంటపం, మల్లెపువ్వు వంటి సినిమాలు ఘన విజయం సాధించటంతో అగ్ర నటుడిగా ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకొన్నాడు.

ఆ తర్వాత కుటుంబ కథ చిత్రాల కధానాయకుడిగా స్థిరపడ్డాడు. కథానాయుడిగా మంచి స్థానంలో ఉన్నా కూడా ఎటువంటి భేషజాలు లేకుండా సాటి హీరోలతో కలిసి నటించేవాడు. శోభన్ బాబుకు మే 15, 1958న కాంత కుమారితో వివాహమయినది. వారికి ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు. వారి పేర్లు: కరుణ శేషు, మృదుల, ప్రశాంతి, నివేదిత.

CLICKHERE : బ్యూటీపార్లర్‌కు వెళ్లకుండా ఇంట్లోనే ఫేషియల్‌ చేసుకుందామా


సినీ రంగంలో ఉన్నా ఎటువంటి వ్యసనాలకు లోను కాకుండా ప్రతి రోజు షూటింగ్ అయ్యిపోయినా వెంటనే ఇంటికి వెళ్లి కుటుంబంతో గడిపేవాడు. క్రమశిక్షణతో కూడిన జీవితానికి ఉదాహరణగా శోభన్ బాబుని చెప్పవచ్చు. శోభన్ బాబు తన సంతానాన్ని ఎవరిని సినిమాల్లోకి తీసుకురాలేదు.

ఎప్పటికి ప్రేక్షకులు మదిలో అందాల హీరోగా ఉండాలనే కోరికతో శోభన్ బాబు 220 పైగా సినిమాల్లో నటించి 1996 లో విడుదల అయిన హలో..గురూ సినిమాతో తన 30 సంవత్సరాల నటజీవితానికి స్వస్థి చెప్పి చెన్నైలో తన కుటుంబ సభ్యులతో ఆనందంగా కాలం గడిపేవాడు. ఎంతో మందికి ఎన్నో దానాలు చేసాడు.శోభన్ బాబు 2008, మార్చి 20 ఉదయం గం.10:50ని.లకు చెన్నై లో మరణించాడు.



block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top