హేమ రూటే వేరు... కోరిక తీరేనా?

సినీ రంగానికి వచ్చిన కొత్తలో కొంచెం బిడియంగా ఉన్నా,ఆ తర్వాత సినీ రంగంలో రాణించాలంటే కొంచెం హుషారు ఉండాలి. అలాంటి హుషారుతో తెలుగు సినీ పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దూసుకుపోతున్న నటీమణులలో హేమ ఒకరు. 

ఇప్పటివరకు అక్క,వదిన వంటి పాత్రలను పోషించిన హేమ విభిన్నమైన పాత్రలను పోషిస్తుందట. ఇప్పటికే కుమారి 21ఎఫ్ లో హీరోయిన్ తల్లిగా నటించింది.

CLICKHERE  : మూడు పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ ప్రముఖులు

Hema want to police and don characters in telugulifestyle

దర్శకులు తన కోసం వెరైటీ పాత్రలను సృష్టిస్తే చేయటానికి రెడీ అంటూ, తనకు పోలీస్,లేడి డాన్ పాత్రలు అయితే బాగుంటాయని దర్శకులకు హింట్ ఇస్తోంది. టాలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు తక్కువ వస్తున్న ఈ సమయంలో హేమ కోరిక తీరటం కష్టమని ఫిల్మ్ నగర్ లో జోరుగా చర్చ సాగుతుంది. 



ఇటువంటి పాత్రలు విజయశాంతి,మాలాశ్రీ వంటి వాళ్ళకే సాధ్యం అయింది. హేమ పోలీస్ పాత్రలు చేసి మరో విజయశాంతి కావాలని కలలు కంటుందా అని ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే హేమ అనుకున్న విధంగా పాత్రలను దర్శకులు ఇస్తారా లేదా అనేది వేచి చూడాలి.






block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top