మతిమరుపును పోగొట్టే సులభమైన చిట్కా

సాధారణంగా మనకి మతిమరుపు అనగానే టక్కున గుర్తొచ్చేది గజిని. 15 నిమిషాలకోసారి మరచిపోయే పాత్రలో నటించిన సూర్య అంతలా ఆకట్టుకున్నాడు. గజిని నుండి గత ఏడాది వచ్చిన బలే బలే మగాడివోయ్ వరకు... ఇలా మతిమరుపు అనే కాన్సెప్ట్ తో ఎన్నో చిత్రాలు వచ్చాయి. 

CLICKHERE : ఇది చదివితే... ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కి వెళ్ళరు

నిజానికి కొందరు మతిమరుపు అనేది గొప్ప వరం అంటారు... ఇంకొందరు దీనిని మించిన శాపం ఉండదు అంటారు. ఏది ఏమైనా ఇది కూడా ఓక ఆరోగ్య సమస్యే. ముఖ్యంగా ఈ కాలంలో షార్ట్-టర్మ్ మెమరీ లాస్ అనేది ఎక్కువవుతుంది. ఒక గ్రాము పసుపుతో ఈ సమస్య కి స్వస్తి పలకచ్చంటున్నారు డాక్టర్లు.

CLICKHERE : కూర్చొన్న చోటే క్యాలరీలను ఖర్చు చేసే బెస్ట్ టిప్స్…



ఆస్ట్రేలియా కు చెందిన మొనాష్ యూనివర్సిటీ లోని పరిశోధకులు నిర్వహించిన ఓ అధ్యయనం ప్రకారం కేవలం ఒక్క గ్రాము పసుపు షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఉన్నవారికి గొప్ప వరంలా మారుతుందని తేలింది. 60 ఎల్లి దాటిన కొందరిపై ఈ అధ్యయనం నిర్వహించారు. రెండు గ్రూపులుగా విడదీసి.. మొదటి గ్రూప్ కి రోజు పొద్దున్న వారు తినే ఆహారంలో 1 గరం పసుపు వేసి ఇచ్చారట. 

CLICKHERE : సమయానికి ఆహారం తీసుకోకపోతే....అది తగ్గుతుందట!

మరో గ్రూప్ కి సాధారణ ఆహారాన్ని ఇచ్చారట. కొన్ని రోజుల తరువాత.. రోజు పసుపు తిన్న వారి షార్ట్ టర్మ్ మెమరీ లాస్ తగ్గిందని తేలింది. ఇదే కాకుండా వీరిలో ప్రాబ్లంని సాల్వ్ చేసే గుణం కూడా పెరిగినట్టు పరిశోధకులు తెలిపారు. 

పసుపులో ఎన్నో అధ్బుతమైన ఔషధ గుణాలు ఉంటాయన్న సంగతి మనకు తెలిసిందే. కేవలం కూరలలో కాకుండా.. పొద్దున తినే ఆహారంలో కూడా ఒక గ్రాము పసుపు వేసుకొని తింటే మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు.

CLICKHERE : పాలు, బెల్లం కలిపి తీసుకుంటే ఏమవుతుందో తెలిస్తే...షాక్

CLICKHERE : పులిపిరి కాయలను మాయం చేసే అద్భుతమైన చిట్కాలు

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top