అల్యూమినియం ఫాయిల్స్ లో చుట్టిన ఆహారం తింటే ఏమవుతుందో తెలుసా?

బేక‌రీ ఉత్ప‌త్తులు, చికెన్ క‌బాబ్స్‌, లెగ్ పీస్‌లు, తందూరీ రోటీ వంటి  ఆహార ప‌దార్థాలంటే ఇష్టం లేని వారు ఎవరు ఉండరు. అయితే ఆ ఆహారపదార్ధాలను చుట్టి ఒక వెండి కాగితం ఉండటం చూసారా? దాన్నే అల్యూమినియం ఫాయిల్ అని అంటారు. 

CLICKHERE : శబరిమల గురించి ఆసక్తికరమైన విషయాలు

అల్యూమినియం లోహాన్ని కొన్ని ప్ర‌త్యేక ప‌ద్ధ‌తుల్లో ప్రాసెసింగ్ చేయ‌డం ద్వారా ఆ ఫాయిల్‌ను త‌యారు చేస్తారు.ఈ  మ‌ధ్య కాలంలో ఎక్క‌డ చూసినా ఈ ఫాయిల్ వాడ‌కం ఎక్కువైపోయింది కూడా.  ఆ అల్యూమినియం ఫాయిల్ చుట్ట‌బ‌డి ఉన్న ఆహారాన్ని తింటే మ‌న ఆరోగ్యానికి చాలా ప్ర‌మాదం కలుగుతుంది. 

CLICKHERE : అనుష్క సంపాదన ఎంతో తెలిస్తే....షాక్
యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్‌, ఈజిప్ట్ దేశాల‌కు చెందిన కొంత మంది సైంటిస్టులు అల్యూమినియం ఫాయిల్ చుట్ట‌బ‌డి ఉన్న కొన్ని ఆహార ప‌దార్థాల‌పై ల్యాబొరేట‌రీలో చాలా  ప్ర‌యోగాలు చేశారు. ఆ ప్రయోగంలో అల్యూమినియం ఫాయిల్‌ను ఆహార ప‌దార్థాల‌కు చుట్ట‌డం వ‌ల్ల దానిలో  నుంచి కొన్ని అల్యూమినియం అణువులు స్వ‌ల్ప మోతాదులో ఆహారంలో క‌లుస్తున్నాయ‌ట‌. 



CLICKHERE : బట్టతల సమస్యకు చెక్ పెట్టాలంటే....

దీంతో ఆ ఆహారాన్ని తిన్న మ‌న‌కు వివిధ ర‌కాల అనారోగ్యాలు వ‌స్తున్నాయ‌ట‌. ప్ర‌ధానంగా అల్జీమ‌ర్స్‌, ఎముక‌ల సంబంధ వ్యాధులు, మూత్ర‌శాయ అనారోగ్యాలు, మెద‌డు క‌ణాల ప‌నితీరు దెబ్బ‌తిన‌డం వంటి వ్యాధులు వ‌స్తున్నాయ‌ట‌. అల్యూమినియం ఫాయిల్స్‌పై ఆ సైంటిస్టులు చేసిన ప్రయోగానికి సంబంధించిన రుజువుల‌ను ఇంట‌ర్నేష‌న‌ల్ జ‌ర్న‌ల్ ఆఫ్ ఎల‌క్ట్రోకెమిక‌ల్ సైన్స్‌లో కూడా ప్ర‌చురించార‌ట‌.

CLICKHERE : సుహాసిని మణిరత్నం గురించి మనకు తెలియని విషయాలు
అల్యూమినియం ఫాయిల్స్‌ను ఎక్కువ‌గా వాడితే పైన చెప్పిన వ్యాధులు దీర్ఘ‌కాలంలో వ‌స్తాయ‌ట‌. ఈ క్ర‌మంలో అల్యూమినియం ఫాయిల్స్ చుట్టిన ఆహారాన్ని తిన‌క‌పోవ‌డ‌మే ఉత్త‌మ‌మ‌ని వైద్యులు కూడా చెబుతున్నారు. అల్యూమినియం ఫాయిల్స్‌కు బ‌దులుగా పింగాణీ, సెరామిక్ వంటి వ‌స్తువులలో ఆహారాన్ని పెట్ట‌వ‌చ్చ‌ని, వాటితో ఎలాంటి ప్ర‌మాదం లేద‌ని సైంటిస్టులు చెబుతున్నారు. 

CLICKHERE : బిర్యానీ ఆకును ఇంటిలో కాల్చితే....ఏమవుతుందో తెలుసా?

కాబ‌ట్టి అల్యూమినియం ఫాయిల్స్ ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండ‌డం మ‌రిచిపోకండి. ఈ మ‌ధ్య కాలంలో ఇలాంటి వార్త‌లు ఎక్కువ‌గా తెలుస్తున్న క్ర‌మంలో మ‌నం మ‌న ఆరోగ్యం ప‌ట్ల క‌చ్చితంగా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సిందే. మొన్నా న‌డుమ మ్యాగీ నూడుల్స్‌, నిన్న బ్రెడ్‌, ఇప్పుడు అల్యూమినియం ఫాయిల్… ఇంకా ఇలాంటివి ఎన్ని తెలుసుకోవాల్సి వ‌స్తుందో క‌దా!

CLICKHERE : ఇది చ‌దివాక అర‌టి పండు తొక్క‌ను పారేయ‌రు..!

CLICKHERE : కాలేజ్ కుర్రాడిలా అలరిస్తున్న మహేష్ బాబు వయస్సు ఎంత ?

CLICKHERE : 15 నిమిషాల్లో ఒంటి నొప్పులు తగ్గాలంటే ఏమి చేయాలి?

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top