సుహాసిని మణిరత్నం గురించి మనకు తెలియని విషయాలు

సుహాసిని అంటే తెలియని వారు ఎవరు ఉండరు. ఆమె ఎన్నో హిట్ సినిమాల్లో నటించారు. సినిమా పరంగా ఏ పాత్ర ఇచ్చిన ఆ పాత్రకు తగ్గట్టుగా ఒదిగిపోతారు. సుహాసిని పరమపూడి అనే గ్రామంలో జన్మించారు. పరమపూడి గ్రామం శ్రీలంకకు రెండు గంటల ప్రయాణం. 

ఆమె తల్లితండ్రులు పరమపూడిలోనే ఉండేవారు. తాతయ్య మద్రాస్ లో నివసించేవారు. సుహాసిని చిన్నతనం నుంచి తల్లితండ్రులకు దూరంగా మద్రాస్ తాతయ్య ఇంటిలోనే పెరిగారు.

సుహాసిని తాతయ్య శిక్షణలో బ్యాంక్ మేనేజర్ ని చేద్దామని అనుకున్నారట. అయితే అనుకోకుండా నటిగా మారింది సుహాసిని. సుహాసిని నటించనని చెప్పితే కమల్ హాసన్ బుజ్జగించి స్టూడియో కట్టిస్తానని చెప్పి ఫిలిం స్కూల్ లో జాయిన్ చేసాడు. అక్కడి నుంచి కెమెరా అసిస్టెంట్ గా సినీ రంగంలోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత నటిగా మారింది. 


CLICKHERE : నోటి దుర్వాసన ఎందుకు వస్తుంది?

కమల్ స్టూడియో కట్టి ఇవ్వలేదు కానీ ఇన్ని ఏళ్ల నట జీవితాన్ని పూర్తి చేసానని సరదాగా అంటూ ఉంటారు సుహాసిని. మణిరత్నంను భర్తగా పొందటం తన అదృష్టం అని సుహాసిని చాలా ఇంటర్వ్యూ లలో చెప్పారు. అయనకు భార్య అయినందుకు గర్వపడతాను. ఆయనకు సమయానికి అన్ని సర్ది పెడుతూ ఉంటాను. ప్రతి విషయాన్నీ నాతో పంచుకుంటారు. 

1980 సంవత్సరంలో సుహాసిని తమిళ పరిశ్రమ ద్వారా నటిగా పరిచయం అయ్యింది. పరిచయం అయిన మొదటి సినిమాకే రాష్ట్ర ప్రభుత్వ అవార్డు ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత తెలుగులో స్టార్ హీరోలందరి సరసన నటించింది. సుహాసిని జాతీయ అవార్డు,ఫిల్మ్ ఫెర్ అవార్డు వంటి అనేక అవార్డు లను గెలుచుకున్నారు. సుహాసిని దర్సకత్వం, స్క్రిప్ట్ రాయటం వంటివి కూడా చేసారు. సుహాసిని తెర ముందే కాకుండా తెర వెనక కూడా ఎన్నో పాత్రలను పోషించారు సుహాసిని.

CLICKHERE : కాఫీ త్రాగితే కొలస్ట్రాల్ పెరుగుతుందా? CLICKHERE : సుమ యాంకరింగ్ లోకి ఎలా వచ్చిందో తెలుసా?


block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top