చానల్స్ రేటింగ్ కోసం మరీ ఇంత దిగజారతారా ?

హీరోయిన్లు రిటైరైపోతే తల్లి కేరెక్టర్లు అత్త కేరెక్టర్లు చేసుకుంటారని తెలుసుకానీ ఇలా కాపురాల్ని రోడ్డుకీడుస్తారని ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. నాలుగ్గోడల మధ్య జరిగే గొడవల్ని వీళ్లు గీకి పీకి పాకం పట్టేస్తున్నారు. టీవీ ఛానెళ్ల రేటింగ్ కోసం… ఎంటటైన్మెంట్ పేరుతో జరుగుతున్న వికృతం ఇది. ఒకప్పటి మాజీ హీరోయిన్స్ అందరూ ఇపుడు ఛానెళ్లలో పోటాపోటీగా ఢీ కొడుతున్నారు. 

CLICKHERE: మెగాస్టార్ ఇంటి గురించి తెలిస్తే...షాక్ అవ్వాల్సిందే

కొంపలు తీసే వ్యవహారాల్ని కూల్ గా మొదలు పెట్టి… అసహనం నటిస్తూ… మధ్యమధ్యలో ఆగ్రహంతో చెయ్యెత్తుతూ అమ్మోరులా ఊగిపోతూ రక్తికట్టించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. చూస్తున్నవాళ్లకి చికాకు తెప్పిస్తున్నారు.


CLICKHERE : అన్నం గంజి నీటిలో ఉన్న అద్భుతమైన ప్రయోజనాలు

ఎవరి కోసం ఇదంతా ?
ఎవడో ఓ తాగుబోతు. వాడి భార్య, తల్లి, అత్త. ఈవిడ మొదలు పెడుతుంది షో వాళ్లతో! వాడు ఎంత వేధిస్తాడో సాధిస్తాడో వివరించి వాడికి క్లాస్ తీసుకుంటుంది. నువ్వసలు మనిషివేనా అంటూ రగిలిపోతుంది ! అంతటితో ఆగదు… నీకు ఈమెతోనేనా అక్రమ సంబంధం ఉంది అంటూ మరొకామెను ప్రవేశపెడుతుంది. 

CLICKHERE : బొటనవేలి కంటే పక్కన వేలు పొడవుగా ఉంటే ఏమి అవుతుంది?

అప్పటికే అక్కడున్న ఆమె… ఈమె కొప్పుకొప్పు కలిపి కొట్టుకుంటారు. ఆ విజువల్స్ ప్రోమోలో పడతాయ్. ఇది కథకాదు జీవితమో అంతకు మించిన ఘోరమో తెలీదు కానీ ఈవిడ మాత్రం ఆ ఏడుపును క్యాష్ చేసుకుంటుంది. నీతులు చెబుతూ సూక్తులు చెబుతూ సెట్ రైట్ చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తుంది. ఈలోగా గంట అయిపోద్ది. మళ్లీ తర్వాత మరో ఫ్యామిలీ కుంపటి గురించి వచ్చే వారం అనే ప్రోమో పడిపోతుంది. 

చావును కూడా వినోదంగా చూసే జమానాలో ఉన్నాం ! అందుకే ఇలాంటి ప్రోగ్రామ్స్ మూడు నాలుగు ఛానెళ్లని ముంచెత్తుతున్నాయ్.
CLICKHERE : ప్రతి రోజు రసం అన్నం తినటం వలన ఎన్ని లాభాలో తెలుసా?

ఇందులో కొన్ని బేసిక్ మోడల్ క్వశ్చన్స్ ఉన్నాయ్. 
వాడెవడి కాపురంలోనో వీళ్లు ఎందుకు వేలు పెడుతున్నారు ? వాడు అలా చేయొచ్చు చేయకూడదని జడ్జిమెంట్ వీళ్లు ఎలా ఇస్తారు ? అప్పటి వరకూ వాళ్ల కుటుంబానికి చుట్టాలకి మాత్రమే తెలిసిన గొడవ ఇపుడు ప్రపంచానికి తెలియడం వల్ల వచ్చిందేమిటి ? పరువు పోవడం తప్ప ! 

CLICKHERE : వీళ్ళ జీతాలు చూస్తే మతి పోవాల్సిందే?

పైగా ఇలాంటి పంచాయితీలు పెట్టే అధికారం కామెంట్లు చేసే హక్కు ఎవరు ఇచ్చారు వీళ్లకి ? ఇది ఆ బాధితుల ఆత్మగౌరవానికి సంబంధించిన ఇష్యూ కాదా ? అన్నిటికీ మించి… వీళ్లు పెట్టిన పంచాయతీలు ఫలించి ఎన్ని కాపురాలు నిలిచాయ్ ? వీళ్లు చెబుతున్న దాంట్లో ఎన్ని ఒరిజినల్ ?

అయినా ఎవరో కష్టాలతో మనం వినోదం ఏంటి ? చూసి ఆలా జరక్కూడదని తెలుసుంటారని చెప్పే కుంటి లాజిక్కుల్లో వాస్తమెంతో వినేవాళ్లకే కాదు… చెప్పే వాళ్లకి కూడా తెలుసు. అన్నిటికీ మించి… మనం కోళ్ల పందేలు చూస్తాం కదా అని ఎవరు బడితే వాళ్లు కొట్టుకుంటే కూడా చూస్తారనుకోవడం చీప్ టేస్ట్. కాదు కాదు కరెక్షన్. చీపెస్ట్ !

CLICKHERE : భార్య గర్భిణిగా ఉన్నప్పుడు భర్త చేయకూడని పనులు

CLICKHERE : వెల్లుల్లి రేకుల్ని దిండు కింద పెట్టుకుని నిద్రిస్తే ఏం జ‌రుగుతుందో తెలుసా..?
Share on Google Plus