రద్దు అయిన 500,1000 నోట్లన్నిటిని తీసుకున్న తర్వాత ప్రభుత్వం ఏమి చేస్తుందో తెలిస్తే షాక్ అవుతారు...

కేంద్ర ప్ర‌భుత్వం పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ప్రజల వద్ద ఉన్న అన్ని పెద్ద నోట్లను తీసుకుని వాటిని ఏం చేస్తారు అని చాలా మందికి సందేహం వచ్చే ఉంటుంది. ఈ ప్రశ్నకు ఆర్బీఐ అధికారులు గురువారం సమాధానమిచ్చారు. "రిజర్వ్‌బ్యాంకుకు చెందిన ఇష్యూ ఆఫీసుల వద్ద ఈ నోట్లను ఉంచుతాం. అక్కడ ఆ నోట్లను పరిశీలిస్తాం. రీసైక్లింగ్‌కి పనికొచ్చేవాటిని.. పనికిరానివాటిని 'కరెన్సీ వెరిఫికేషన్‌ అండ్‌ ప్రాసెసింగ్‌ సిస్టమ్‌ (సీవీపీఎస్‌)' ద్వారా విభజిస్తాం" అని ఆర్బీఐ వెల్లడించింది.


పనికిరాని నోట్లను వేగంగా, భద్రమైన, పర్యావరణహిత విధానంలో చలామణిలోంచి తప్పించే ఈ వ్యవస్థను 2003లో అప్పటి ఆర్బీఐ గవర్నర్‌ బిమల్‌ జలన్‌ ప్రవేశపెట్టారు. ఒక్కో సీవీపీఎస్‌కూ గంటలో 60 వేల నోట్లను ప్రాసెస్‌ చేసే సామర్థ్యం ఉంటుంది. ఈ వ్యవస్థ నోట్లను లెక్కిస్తుంది. అవి అసలైనవా లేక నకిలీవా గుర్తిస్తుంది. అసలైనవని తేలాక.. ఆ నోట్లు రీసైక్లింగ్‌కి పనికొస్తాయో రావో పరిశీలిస్తుంది.

CLICKHERE : కార్తీకమాసంలో దీపారాధన మహిమ !

పనికిరాని వాటిని ముక్కలు ముక్కలు చేసేస్తుంది. పనికొచ్చేవాటిని.. మళ్లీ నోట్ల తయారీకి అవసరమైన కాగితంగా మార్చేవిధంగా జాగ్రత్తగా కట్‌ చేస్తుంది. ముక్కలుగా కట్ చేసిన వాటిని 100 గ్రాములుగా ఉండే ఒక్కో బ్రికెట్లగా చేసి టెండర్లును పిలిచి పారిశ్రామిక అవసరాలకు వినియోగిస్తారు.

CLICKHERE : రద్దయినా రూ. 500 నోట్లు, రూ. 1000 నోట్లు ఇలా మార్చుకోండి

CLICKHERE : హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ స్కిట్ ల విలువ ఎంతో తెలుసా..?
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top