డబ్బుని హోం డెలివరీ! ఇక ఏటీఎంలతో పని లేదు!

పెద్ద నోట్లు రద్దుతో ఏర్పడిన నగదు కొరతకు దేశీయ ఆన్‑లైన్ మార్కెట్ దిగ్గజం ఓ బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. ప్రజలకు నేరుగా డబ్బుని అందించేందుకు Cash@Home అనే సర్వీస్ తో డబ్బుని ఇంటివద్దకే డెలివరీ చేయనున్నట్టు స్నాప్-డీల్ తెలిపింది. ఈ సర్వీస్ ను గురువారం నుంచి ప్రారంభిస్తున్నట్టు స్నాప్‑డీల్ ప్రకటించింది.


CLICKHERE : సప్తగిరి సినిమా బడ్జెట్‌ ఎంతో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే

ఒక బుకింగ్ కు గరిష్టంగా రూ.2000 వరకు నగదును స్నాప్ డీల్ డెలివరీ చేస్తుంది. నగదు డెలివరీ చేసిన సమయంలోనే యూజర్లు తమ బ్యాంకు ఏటీఎం కార్డును పీఓఎస్ మిషన్ లో స్వైప్ చేసి స్నాప్‑డీల్ కు ఈ నగదు చెల్లించవచ్చు. ఈ సర్వీస్ అందిస్తున్నందుకు కేవలం రూ.1 మాత్రమే కంపెనీ చార్జ్ చేస్తుంది. బుకింగ్ చేసుకునే సమయంలోనే ఈ ఫీజును డెబిట్ కార్డు ద్వారానైనా లేదా ఫ్రీఛార్జ్ యాప్ ద్వారానైనా చెల్లించాల్సి ఉంటుందని కంపెనీ పేర్కొంది.

CLICKHERE : 2017వ సంవత్సరంలో ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారమే అవుతుందట!


ఈ సర్వీస్ తో గంటల కొద్ది బ్యాంకుల వద్ద, ఏటీఎం ల ముందు డబ్బు కోసం ఎదురు చూసే పని లేకుండా సులభమైన పద్ధతిలో ప్రజలకు డబ్బుని అందిస్తున్నామని స్నాప్-డీల్ పేర్కొంది. అలాగే Cash@Home సర్వీస్ వాడేటప్పుడు మరే ఇతర ఆర్డర్లను కంపెనీ స్వీకరించదని స్పష్టం చేసింది. ఇప్పటికే గుర్గావ్, బెంగళూరు లాంటి నగరాల్లో ఈ సర్వీస్ ను ప్రారంభించారు. ఇంకొన్ని రోజుల్లో ఇతర నగరాల్లో కూడా ఈ సర్వీస్ ను అందుబాటులోకి తెస్తామని స్నాప్-డీల్ తెలిపింది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top