అరవింద్ స్వామి దగ్గర ఎన్ని వేల మంది ఉద్యోగులున్నారో తెలుసా!

చాలా కాలం తర్వాత ధృవ సినిమా ద్వారా తెలుగు తెరపై కనిపించిన అరవింద్ స్వామి ఒక ఇంటర్వ్యూలో పలు విషయాలు చెప్పారు. సురేందర్ రెడ్డి వర్కింగ్ స్టైల్ బాగా నచ్చిందన్నారు. నటుడిగా రకరకాల పాత్రలు చేయాలని… ఎప్పుడూ హీరో తరహా పాత్రలే చేయడం తనకు నచ్చదన్నారు. సినిమాలకు దూరంగా ఉన్న సమయంలో తన జీవితంలో జరిగిన సంఘటనలను అరవింద్ స్వామి వివరించారు. 2006లో తనకు ప్రమాదం జరిగిందని.


CLICKHERE : చైతు పెళ్లికి మొదట గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఎవరు ?

ఆ సమయంలో వెన్నుముక దెబ్బతిన్నదని స్వామి వివరించారు. పక్షవాతం వచ్చి ఇంటికే పరిమితమైపోయానని చెప్పారు. ఏడాదిపాటు నడవలేకపోయానని తిరిగి మామూలు మనిషి అయ్యేందుకు నాలుగేళ్లు పట్టిందన్నారు. అయితే ఆ సమయంలో ఎలాంటి నెగిటివ్ ఆలోచనలను దగ్గరకు రానివ్వలేదన్నారు.

CLICKHERE : మలబద్దకం నుండి ఉపశమనం పొందాలంటే...ఇంటి చిట్కాలు

జీవితం మొత్తం సినిమాలే అని తాను ఎప్పుడూ అనుకోలేదన్నారు. స్టార్‌ డమ్‌ను ఆస్వాదిస్తూ బతకడం కంటే జీవితంలో మరిన్ని పనులు చేయాలనిపించిందన్నారు. అందుకే మధ్యలో సినిమాలకు విరామం ప్రకటించి వ్యాపారంలోకి వెళ్లినట్టు వివరించారు. అంతర్జాతీయ స్థాయిలో పలు వ్యాపారాలు చేసినట్టు అరవింద్ చెప్పారు. ప్రస్తుతం తన దగ్గర 5వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని వెల్లడించారు.

CLICKHERE : పవన్ ఫస్ట్ హీరోయిన్ చెప్పిన షాకింగ్ విషయాలు

హీరోగా పరిచయమైన వ్యక్తి హీరోగానే కొనసాగాలనే రూల్ ఎక్కడా లేదన్నారు. కేవలం భారతీయ సినిమాలోనే ఈ పద్దతి ఉందన్నారు. మన దేశం వెలుపలి నటులంతా అన్ని రకాల పాత్రలు చేస్తూ ఇమేజ్ చట్రంలో చిక్కుకోకుండా నటనను ఎంజాయ్ చేస్తున్నారని అరవింద్ స్వామి చెప్పారు.

CLICKHERE : కంప్యూటర్ ముందు ఎక్కువగా కూర్చొనే వారి కోసం....మత్స్యాసనం

CLICKHERE : ఎన్టీఆర్ ఇంటి గురించి తెలిస్తే షాక్ అవ్వలసిందే

Share on Google Plus