జీయో వాయింపు మొద‌లైందా?

జియో ఉచిత ఆఫ‌ర్‌ను ఆనందంగా ఎంజాయ్ చేస్తున్న వినియోగ‌దారులు ఈ వార్త‌ను జాగ్ర‌త్త‌గా చ‌ద‌వాల్సిందే. కొన్ని నెల‌లుగా అప‌రిమిత వాయిస్‌కాల్స్‌, 4జీ డేటాను ఉచితంగా అందిస్తున్న జియో కొత్త ఇయ‌ర్ నుంచి రిట‌ర్న్‌పై దృష్టి పెట్టిన‌ట్లు తెలుస్తోంది. అయితే, ఆ వ‌సూళ్ల‌కు కూడా జియో ప్ర‌త్యేక ఆఫ‌ర్ అంటూ కొత్త క‌ల‌ర్ వేసి మార్కెట్‌లోకి వ‌ద‌లాల‌ని ప్ర‌య‌త్నిస్తోంది. జియో వినియోగ‌దారుల‌కు వ‌చ్చే మార్చి వ‌ర‌కూ ఉచిత సేవ‌లు అందుబాటులో ఉంటాయ‌ని ప్ర‌క‌టించిన విష‌యం విధిత‌మే.

CLICKHERE : షుగర్ వచ్చే అలవాట్లు ఇవే.... మీకు ఉన్నాయేమో....ఒక్కసారి చెక్ చేసుకోండి

ఆ క్ర‌మంలోనే కొత్త ఏడాది జ‌న‌వ‌రి నుంచి జియో మ‌రో ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించ‌బోతున్న‌ట్లు లీకులు వ‌దిలింది.ఇప్ప‌టి వ‌ర‌కూ జియో ఉచిత సేవ‌లు పొందేవారు రోజుకు 1జీబీ వ‌ర‌కూ 4జీ డేటాను ఉచితంగా పొంద‌వ‌చ్చు. ఆ త‌ర్వాత డేటా కావాలంటే డేట్ మారేవ‌ర‌కూ ఆగాల్సిందే. దానికి ప‌రిష్కారంగానే జియో ఈ కొత్త ఆఫ‌ర్‌ను తెస్తోంది. 51 రూపాయ‌ల‌తో రిచార్జ్ చేసుకుంటే ఇక‌పై 1జీబీ డేటా ఉచిత లిమిట్ అయిపోయిన త‌ర్వాత కూడా డేటా సేవ‌లు పొంద‌వ‌చ్చు. అంటే 1జీబీ ఉచిత డేటా త‌ర్వాత 51 రూపాయ‌లు క‌డితేనే ఆ రోజుకు డేటా అందుబాటులోకి వ‌స్తుంది.

CLICKHERE : తెలుగు టీవీ యాంకర్స్ భార్య భర్తల ఫోటోల మీద ఒక లుక్ వేద్దాం
అయితే ప్ర‌స్తుతానికి ఇది మ‌న‌కేం ఇబ్బందిలే అని వినియోగ‌దారుడు అనుకోవ‌చ్చు. అయితే, వినియోగ‌దారుడిని డ‌బ్బులు పెట్టి రిచార్జ్ చేసుకునేవైపు మ‌ళ్లీంచ‌డానికే ఈ కొత్త ఆఫ‌ర్‌ను తెర‌మీద‌కు తెస్తున్నార‌న్న వాద‌నా వినిపిస్తుంది. ఒక్క‌సారి డ‌బ్బులు క‌ట్ట‌డానికి అల‌వాటు ప‌డితే ఆ త‌ర్వాత ఇక యూజ‌ర్ జేబుకు చిల్లు పెట్ట‌డం జియోకు పెద్ద క‌ష్ట‌మేమీ కాదు. మొత్తానికి ఉచితం వెనుక వ‌సూళ్ల‌కు జియో తెర‌తీసిన‌ట్లేనా అన్న‌ది తేలాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

CLICKHERE : ఎంతటి విషపు పాము కరిచినా….ఇలా చేసి ప్రాణాలు రక్షించవచ్చు. గుర్తుపెట్టుకోండి, షేర్ చేయండి.

CLICKHERE : వామ్మో, ఒంటి సబ్బు వాడటం ఇంత ప్రమాదకరమా?

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top