ఖైదీ నెంబ‌ర్ 150 ఆ నాలుగు సీన్‌లు కెవ్వుకేక‌…!!

మెగాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అన్న‌య్య రీ ఎంట్రీ మూవీ థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేసింది. ఈ సినిమా తొలి షో కూడా ప‌డింది. లాంగ్ గ్యాప్ త‌ర్వాత బాస్‌ని సిల్వ‌ర్ స్క్రీన్‌పై చూసి ఫ్యాన్స్ జ‌ల్సా చేసుకుంటున్నారు. సినిమాలోని నాలుగు సీన్‌లు బాగా పేలాయని చెప్పుకుంటున్నారు. మొద‌టిది వాట‌ర్ మాఫియా గురించి చెబుతూ చిరంజీవి చెప్పిన డైలాగులు ఓ ఊపు ఊపేశాయ‌ట‌. వీటితో థియేట‌ర్‌లు విజిల్స్‌, చ‌ప్ప‌ట్లతో 5 నిముషాలు మారు మ్రోగుతూనే ఉంద‌ట‌.


CLICKHERE : బ్లాక్ హెడ్స్ ను సులభంగా తగ్గించుకోవటానికి చిట్కాలు

ఠాగూర్‌లోని హాస్పిట‌ల్ సీన్‌ని మించేలా ఉందంటున్నారు ఈ సీన్. వినాయ‌క్ టాలెంట్ మ‌రోసారి ప్రూవ్ అయింద‌ని చెబుతున్నారు.ఇక‌, రెండో సీన్‌.. రెండో చిరంజీవి ఫ్లాష్ బ్యాక్ సీన్‌. మేధావి అయిన ఈ రోల్‌…. రైతుల కోసం ఎలా పోరాడాడు, ఏం చేశాడు… ఆయన జీవితాశ‌యం వంటి ఎలిమెంట్స్‌ను చూపిస్తూ చేసిన ట్ర‌యిల‌ర్ అదిరిపోయింద‌ట‌. వినాయ‌క్ ఈ ఎపిసోడ్‌ని అదిరిపోయేలా తెర‌కెక్కించాడ‌ట‌.

CLICKHERE : అల్లరి నరేశ్ భార్య ఏమి చేస్తుందో తెలిస్తే షాక్ అవుతారు

ఆడియెన్స్‌కు బాగా క‌నెక్ట్ మ‌రో సీన్ ఏంటంటే.. చిరంజీవి డ్యాన్స్‌లు, డైలాగులు, ఫైట్‌లు ప్ల‌స్ కామెడీ టైమింగ్‌. ఇండియాలోని బెస్ట్ డ్యాన్సర్‌లలో చిరంజీవి ఒక‌రు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. 60 ప్ల‌స్‌లోనూ చిరంజీవి అదే గ్రేస్‌, అదే మేజిక్‌తో అద‌ర‌గొట్టాడ‌ట‌. కామెడీ టైమింగ్‌లోనూ బాస్ రెచ్చిపోయాడ‌ని చెబుతున్నారు. పోసాని కృష్ణ‌ముర‌ళి, బ్ర‌హ్మి ఎపిసోడ్‌లలో చిరంజీవి కామెడీ చూసి తీరాల్సిందే అని అంటున్నారు.

CLICKHERE : అల్లు అర్జున్ ఇల్లు చూస్తే షాక్ అవుతారు

ఇక నాలుగో సీన్ ఏంటంటే.. ఈ మూవీలోని కొన్ని సీన్‌ల‌ను టెక్నిక‌ల్‌గా తీర్చిదిద్దాడు ద‌ర్శ‌కుడు వినాయ‌క్‌. హీరోకి చూసిన ప్రతి ప్లేస్‌ని మ్యాప్ రూపంలో త‌న మ‌దిలో ప్రింట్ చేసుకుంటాడు. జైలు మ్యాప్, వాట‌ర్ పైప్ మ్యాప్ సీన్‌లు సినిమాకి అడ్వాంటేజ్ అంటున్నారు. ఇక రైతులు నీటి కోసం చ‌నిపోయే సీన్‌లు కూడా కంట త‌డి పెట్టించాయని అంటున్నారు. ఈ నాలుగు సీన్‌లు ఖైదీ స్థాయిని పెంచేలా ఉన్నాయ‌ని అభిమానులు అంటున్నారు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top