మంచు ఫ్యామిలీలో గొడ‌వ‌… ల‌క్ష్మి వ‌ర్సెస్ విష్ణు

క్ర‌మ‌శిక్ష‌ణ‌కు కేరాఫ్ అయిన మంచు ఫ్యామిలీలో ఇప్పుడు వార్‌కు రంగం సిద్ధ‌మైంది. ఈ వార్‌లో అక్కాచెళ్లెళ్లు మంచు ల‌క్ష్మి వ‌ర్సెస్ మంచు విష్ణు మ‌ధ్య గొడ‌వ‌కు రంగం సిద్ధ‌మైంది. మ‌రి ఈ అక్కాత‌మ్ముళ్ల మ‌ధ్య వార్ ఏంటో చూద్దాం. మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘లక్ష్మి బాంబ్ – ఫ్రమ్ శివకాశి’. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని చాలా రోజులు అయినా ఇప్ప‌ట‌కి రిలీజ్ కాలేదు.


CLICKHERE : బ్లాక్ హెడ్స్ ను సులభంగా తగ్గించుకోవటానికి చిట్కాలు

ముందుగా ఈ ల‌క్ష్మిబాంబ్‌ను డిసెంబ‌ర్ 23న రిలీజ్ అనుకున్నారు. అయితే నోట్ల ర‌ద్దు ఎఫెక్ట్‌తో వాయిదా వేశారు. త‌ర్వాత సంక్రాంతి సినిమాలు థియేట‌ర్ల‌ను ఆక్ర‌మించ‌డంతో ఈ సినిమా రిలీజ్‌కు స‌రైన డేట్ ద‌క్క‌లేదు. ఎట్ట‌కేల‌కు ఈ సినిమాను ఫిబ్ర‌వ‌రి 3న రిలీజ్ చేసేందుకు నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు.

CLICKHERE : అల్లరి నరేశ్ భార్య ఏమి చేస్తుందో తెలిస్తే షాక్ అవుతారు

ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా అదే రోజు ల‌క్ష్మి సోద‌రుడు విష్ణు న‌టించిన ల‌క్కున్నోడు రిలీజ్ అవుతోంది. ఇలా వీరిద్ద‌రు న‌టించిన రెండు చిత్రాలు ఒకే రోజున బాక్సాఫీస్ వ‌ద్ద పోటీకి రెడీ అవుతున్నాయి. ఈ రెండు సినిమాల్లో విష్ణు సినిమా కామెడీ+యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కింది. ఇక ల‌క్ష్మి న‌టించిన ల‌క్ష్మిబాంబ్‌లో ఆమె జ‌డ్జిగా క‌నిపించ‌నుంది.

ఈ పాత్ర‌ పవర్ ఫుల్ గా ఉంటుందని తెలుస్తోంది. మ‌రి ఈ అక్కాత‌మ్ముళ్ల వార్‌లో ఎవ‌రు పైచేయి సాధిస్తారో చూడాలి. మ‌రో షాక్ ఏంటంటే అదే రోజు నాని న‌టించిన నేను లోక‌ల్ సినిమా కూడా రిలీజ్ అవుతోంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top