మోడీ ఫ్రీ రూ.500 బ్యాలన్స్ మెసేజ్ లతో జాగ్రత్త

“పీఎం మోడీ రూ.500లు ఫ్రీ బ్యాలెన్స్ ఇస్తున్నారు” వాట్సప్ యూజర్లందరికీ ఈ మెసేజ్ సర్వసాధారణం. షేర్ చేస్తే ఫ్రీ బ్యాలెన్స్ వస్తుందని చెప్పగానే షేర్లు చేయడం జనానికి అలవాటుగా మారిపోయింది. అదే సైబర్ నేరగాళ్లకు ఈజీగా టార్గెట్ అయ్యేలా చేస్తోంది. ఈ మధ్యకాలంలో వాట్సప్ ఎక్కువగా హ్యాకర్ల బారినపడుతోంది. వాట్సప్ లో వచ్చే స్పామ్ మెసేజ్ లతో దాడులు సులువవుతున్నాయి.


పీఎం మోడీ పేరుతో వచ్చే ఫ్రీ రూ.500 బ్యాలెన్స్ మెసేజ్ లలో లింక్ చేర్చి పంపిస్తారు. దాన్ని మీద క్లిక్ చేయగానే కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. దాన్లో సక్సెస్ ఫుల్ అని మెసేజ్ వస్తుంది. దానికి మరికొందరిని యాడ్ చేయమంటారు. అలా చేస్తూ పోతుంటే… మీ అకౌంట్ ని హ్యాక్ చేస్తుంది సైబర్ దోపిడీ ముఠా. అలా హ్యాకర్ల బారిన పడుతున్న సోషల్ మీడియాలో వాట్సప్ టాప్ ప్లేస్ లో చేరుతుంది. ఇదండి అసలు కథ. ఇలాంటి మెసేజ్ లకు దూరంగా ఉండమంటున్నారు సైబర్ నిపుణులు. ఫేక్ మెసేజ్ లతో టెంప్ట్ చేసి… లాగిన్ అయ్యేట్టు చేస్తారని..ఇది చివరకు నష్టాన్నే చేకూరుస్తుందని అంటున్నారు.

CLICKHERE : తెల్లజుట్టు నల్లగా మారాలంటే....ఏమి చేయాలో తెలుసా

CLICKHERE : పవన్ ఫస్ట్ హీరోయిన్ చెప్పిన షాకింగ్ విషయాలు

Share on Google Plus