ఇంటి లో మార్పులు చేస్తున్నమెగాస్టార్...కారణం ఏంటో తెలుసా?

సొంత బ్యానర్ పై నిర్మించిన ‘ఖైదీ నం150’ ఘన విజయంతో రామ్ చరణ్ ఆనందంతో పొంగిపోతున్నాడు. ఆయన ఒక్కడే కాదు మోగా ఫ్యామిలీ మొత్తం సంతోషంలో మునిగితేలుతోంది. దాదాపు పదేళ్ల తర్వాత చిరంజీవి తెరపైకి రావడం..వస్తూనే.. బంపర్ హిట్ ఖాతాలో వేసుకోవడంతో వారి ఆనందానికి అవధుల్లేవు. ఇదిలా ఉంటే మెగాస్టార్ ఇంటిలో కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారట. ఈ విషయాలను చరణ్ స్వయంగా వెల్లడించారు. నాన్నగారు ఎప్పట్నుంచో ఈ మార్పులు చేయాలని అనుకుంటున్నారని అది ఇన్నాళ్లకు వీలైందని చెప్పుకొచ్చారు.


CLICKHERE : గురక వలన మీకు నిద్ర పట్టటం లేదా

“15ఏళ్ల తర్వాత ఇంటిలో మార్పులు చేస్తున్నాం. ఉపాసన వచ్చినప్పట్నుంచీ కొంత కాలంగా నాన్నగారు ఈ విషయమై ఆలోచిస్తున్నారు. ఈ మార్పులన్నీ పక్కా ఇండియన్ స్టైల్ లో ఉంటాయి. ఎలాంటి ఆధునికతా కనిపించదు. తమ సంప్రదాయ మూలాలను గుర్తు చేసేలా ఇంటిని తీర్చిదిద్దుతున్నాం” అని చరణ్ తెలిపారు. ఇల్లు మారుస్తున్నారంటే కొత్త సభ్యుడిని ఆహ్వానిస్తున్నారా అన్న ప్రశ్నకు ఈ ‘ధృవ’ స్టార్ నవ్వేస్తూ “అయ్యో నేనే ఇంకా చిన్న పిల్లవాడిలా ఫీలవుతున్నా. నేను ఎదిగానని, ఓ వ్యక్తిగా నన్ను నేను హ్యాండిల్ చేసుకోగలను అనుకున్నప్పుడే పిల్లలు గురించి ఆలోచిస్తా. ఇప్పటికైతే అలాంటి ప్లాన్స్ లేవు” అని అన్నారు.

CLICKHERE : అన‌సూయ ల‌గ్జ‌రీ కారు రేటు తెలిస్తే షాకే. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top