ఈ గుర్తులు మీ చేతిపై ఉంటే ప్రపంచాన్నే శాసించవచ్చట..

ప్రపంచ వ్యాప్తంగా చేసిన అధ్యయనంలో సుమారు 2 మిలియన్ల మందిలో కేవలం 3 శాతం మందికి మాత్రమే రెండు అరచేతుల్లోనూ ఎక్స్(X) ఆకారంలో గుర్తులు ఉన్నట్లు తేలింది. అలెగ్జాండర్ రెండు అర చేతుల్లోనూ ఎక్స్ గుర్తులు ఉండటం వల్ల ప్రపంచాన్ని జయిస్తాడని ఆయన ఆస్థాన జ్యోతిషులు అప్పట్లో పేర్కొన్నట్లు చరిత్రలో ఉంది. పురాతన కాలంలో గ్రీకులు, ఈజిప్షియన్లు ఈ విధానాన్ని అనుసరించి భవిష్యత్తు గురించి ఊహించి చెప్పేవారు.

CLICKHERE : పుల్లారెడ్డి స్వీట్స్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు


ఎస్టీఐ యూనివర్సిటీ పరిశోధన చేసిన వ్యక్తుల్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికా దివంగత నేత అబ్రహాం లింకన్‌ కూడా ఉన్నట్లు తెలిపింది. అరచేతిలో ఎక్స్ గుర్తులు ఉన్నవాళ్లు బలవంతులే కాదు వీరికి ఎలాంటి ప్రణాళికలు కూడా అవసరం ఉండదట. వీళ్ళు చాలా దూరం నుంచే ఇతరులను అంచనావేసే గుణం ఉండటమే కాకుండా, వీరిని మోసం చేయడం కూడా చాలా కష్టం. అంతే కాకుండా వీరికి హాని తలపెట్టాలని ప్రయత్నించినా వ్యర్థమవుతుందట. 

CLICKHERE : సెహ్వాగ్‌కు ట్విట్టర్ ద్వారా వచ్చే ఆదాయం ఎంతో తెలిస్తే షాకే?

వీళ్లు శారీరకంగానూ, మానసికంగానూ చాలా శక్తివంతులు. తమతోపాటు ఇతరుల జీవితాల్లోనూ మార్పులు తీసుకొచ్చే సామర్థ్యాన్ని కలిగి ఉంటారట. తిరుగులేని నేతలుగా పేరు ప్రతిష్ఠలు సంపాదించి జన హృద‌యాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారట. ఇలాంటి వ్యక్తులు అత్యంత విజయవంతమైన వారే కాకుండా, పదునైన ఆలోచనలు కలిగి ఉంటారు.
Share on Google Plus