జ‌ల్లిక‌ట్టుకు ఎన్ని సంవ‌త్స‌రాల చ‌రిత్రో తెలిస్తే షాకే

తమిళనాడు జ‌నాలు మ‌రోసారి తమ ప‌ట్టుద‌లను నిరూపించుకున్నారు. ద్రవిడ సంస్కృతిలో భాగమైన జల్లికట్టును కాపాడుకోవడమే తమ లక్ష్యంగా పోరాడారు. ఇందులో ఏ పార్టీకి భాగస్వామ్యం లేదు. యవతరమే స్వచ్ఛందంగా ముందుకు కదిలింది. చివ‌ర‌కు వారికి అంతా త‌మ మ‌ద్ద‌తు ప‌ల‌కక త‌ప్ప‌లేదు. ఉద్య‌మం తాడోపేడో స్థాయికి చేర‌డంతో చివ‌ర‌కు కేంద్రం జ‌ల్లిక‌ట్టుపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసింది.


CLICKHERE : మంచు ఫ్యామిలీలో గొడ‌వ‌… ల‌క్ష్మి వ‌ర్సెస్ విష్ణు

జ‌ల్లిక‌ట్టుపై కేంద్రం విధించిన నిషేధాన్ని ఎత్తి వేయించేందుకు చెన్నై మెరీనా బీచ్ నినాదాలతో హోరెత్తింది. వేలాదిగా గుమికూడి పోరాడిన యువ‌త‌కు త‌మిళ సమాజం యావ‌త్తు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది. తమిళనాడులో పూర్తిగా విద్యా, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. సినిమా షూటింగ్‌లు, ప్రదర్శనలు నిలిచిపోయాయి. ఇప్పుడు తమిళుల ముందు ఉన్న ఎజెండా జల్లికట్టు. 

CLICKHERE : 'తొలిప్రేమ' హీరోయిన్ కీర్తి రెడ్డి ఏమి చేస్తుందో తెలుసా?

ద్రవిడ సంస్కృతిలో జల్లికట్టుకు వేల ఏళ్ల చరిత్ర ఉంది. దాదాపు 3500 ఏళ్ల కిందట తమిళనాడులో జల్లికట్టు జరిగిందనడానికి ఆధారాలు లభించాయి. నీలగిరి జిల్లాలో కరిక్యూర్ అనే గ్రామం వద్ద తవ్వకాల్లో లభ్యమైన శిలాపలకాలపై మనుషులు ఎద్దులను తరిమే దృశ్యాలు ఉన్నాయి. ఇవి 3500 ఏళ్ల నాటివి అని ఆర్కియాలజిస్టులు గుర్తించారు. త‌మ సంస్కృతిలో భాగ‌మైన జల్లిక‌ట్టుపై నిషేధం విధిస్తే ఊరుకునేది లేద‌ని హెచ్చ‌రించ‌డంతో చివ‌ర‌కు కేంద్రం దిగిరాక త‌ప్ప‌లేదు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top