బట్టతల గురించి షాకింగ్ నిజాలు చెప్పిన మన్మదుడు

టాలీవుడ్ మన్మధుడు నాగార్జున ఏళ్లు వచ్చిన ఇంకా యంగ్ హీరోలానే కనిపిస్తారు. అలాంటి నాగార్జునను బట్టతల విపరీతంగా భయపెట్టేసిందట. ఇప్పటివరకు ఏ చిత్రంలో విగ్గు పెట్టాల్సిన పరిస్థితి రాణి నాగార్జునకు బట్టతలా రాకపోయినా చెమటలు పట్టించేసిందట. దానికి కారణం గురించి నాగార్జున ఇటివలే ఓ ఇంటర్వ్యులో చెప్పుకొచ్చాడు. నాకు 28, 29 ఏళ్ల వయసున్నప్పుడు జుట్టు బాగా పలచబడిపోయింది. వెంట్రుకలు బాగా రాలిపోయేవి. నాన్న, అన్నయ్యలాగే నాకూ బట్టతల వచ్చేస్తుందని చాలా భయపడ్డాను.


CLICKHERE : భోజనం ముందు తింటే....షాకింగ్ బెనిఫిట్స్

ఇప్పటిలా అప్పుడేమో హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ ట్రీట్ మెంట్లేమో లేవాయే. 
కేరళలో ఓ ఆయుర్వేద తైలం దొరుకుతుందని, ఆ నూనె పెట్టుకుంటే జుట్టు రాలడం తగ్గిపోయి ఒత్తుగా తయారవుతుందని ఓ మలయాళ ఆర్టిస్టు చెప్పాడు. దాని ధర రూ.80. వెంటనే నా పర్సనల్ కాస్ట్యూమ్ డిజైనర్ శేఖర్‍ను అక్కడకి పంపించాను. అయితే అక్కడ మాత్రం ఒక్కరికి ఒక్క బాటిల్ నూనె మాత్రమే ఇస్తారు.

CLICKHERE : ఇంటి లో మార్పులు చేస్తున్నమెగాస్టార్...కారణం ఏంటో తెలుసా?

అది కూడా లైన్ లో నిలబడి తెచ్చుకోవాలి. బ్లాక్‍లో తీసుకొవాలంటే.. రూ.500 పెట్టాల్సిందే. మొత్తానికి శేఖర్ ఆరు నెలలకు సరిపడా బాటిళ్లు తీసుకొచ్చాడు. ఆ నూనె వాడాన తర్వాత జుట్టు కాస్తంత ఒత్తుగా మారింది. కానీ చేత్తో పెట్టుకుంటే మాత్రం.. చేతికి నల్లగా రంగు అంటుతుంది. ఆ రంగు రెండు మూడు రోజులైన పోదు. అందుకే చేతికి గ్లోవ్స్ వేసుకుని పెట్టుకునేవాడిని. ఆ నూనె పెట్టుకుంటూనే కథలు వినేవాణ్ని. పక్కన ఉన్న వాళ్ళు నవ్వినా.. నా పని నేను చేసుకునే వాడిని. ఇక, ఆ నూనె రంగులానే అప్పుడు పెరిగిన జుట్టు ఇప్పటికీ ఊడలేదు. ప్రస్తుతం ఆ నూనె కూడా దొరకడంలేదు.. అంటూ.. తనను భయపెట్టిన బట్టతల గురించి చెప్పాడు నాగార్జున.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top