విన్నర్‌ సినిమాలో గుర్రాల ముందు పరుగెత్తిన ఈ బుడ్డోడు ఎవరో తెలుసా..?


సూపర్ స్టార్ కృష్ణ. వారసుడిగా ‘రాజకుమారుడు’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ప్రిన్స్ మహేష్‌బాబు. స్టార్ హీరో ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చినప్పటికీ తన సొంత టాలెంట్‌తో చిత్రపరిశ్రమలో నిలదొక్కుకున్న మహేష్. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ‘పోకిరి’ చిత్రంతో చిత్రపరిశ్రమలో అప్పటి వరకు ఉన్న ఎన్నో రికార్డులను బద్దలు కొట్టాడు. అదే విదంగా కృష్ణ వారసుడిగా ఆయన అల్లుడు సుదీర్ బాబు కూడా హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. 
CLICKHERE : భోజనానికి ముందు, భోజనం తర్వాత ట్యాబ్‌లెట్స్ ఎందుకు వేసుకోవాలో తెలుసా?

తాజాగా ఇండస్ట్రీలో మరో వారసుడు కూడా ఎంట్రీ ఇచ్చాడు.. అదే సుదీర్ బాబు తనయుడు చరిత్. మహేష్ బాబుకు మేనల్లుడు. బాలనటుడి‌గా ఇప్పటికే భలే భలే మగాడివోయ్ చిత్రంలో నాని చిన్నప్పటి రోల్ చేశాడు ఈ బుడ్డోడు. తాజాగా సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన విన్నర్ చిత్రంలో కూడా నటించాడు .

CLICKHERE : జియో విడుదల చేసే అత్యంత చవకైన 4 జీ ఫోన్ ఇదే..?

విన్నర్ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ చిన్నప్పటి రోల్ పోషించాడు చరిత్ . అయితే ఈ చిత్రంలో పెద్ద సాహసమే చేశాడు చరిత్. ఈ చిత్రంలో గుర్రాల ముందు పరుగెత్తే సీన్ చేసి అందరినీ ఆశ్చర్య పరిచాడు . గుర్రాల ముందు పరుగెత్తడం అంటే సాహసమే మరి . తాత , మేనమామ‌ల వారసత్వాన్ని పునికి పుచ్చుకున్నట్లు చరిత్ చేసిన సహసం చూసి చిత్ర యూనిట్ అంతా ఖంగు తిన్నారట. తన తనయుడు విన్నర్ చిత్రంలో రిస్కీ షాట్స్ చేసాడని , అతడి ధైర్యాన్ని మెచ్చుకుంటూ ట్వీట్ చేసాడు సుధీర్ బాబు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top