వై.విజయ గుర్తు ఉందా? ఆమె కూతురును చూస్తే హీరోయిన్ కన్నా అందంగా ఉందని అంటారు


ఎనిగండ్ల విజయ అలియాస్ వై.విజయ తెలుగు సినిమా నటి మరియు నృత్య కళాకారిణి. ఈమె మొదటి చిత్రం 1970లో విడుదలైన తల్లితండ్రులు. ఎన్టీఆర్ సరసన శ్రీకృష్ణ సత్య అనే సినిమాలో కథానాయికగా నటించింది. శోభన్‌బాబు సరసన కూడా కథానాయికగా నటించింది. ఇప్పటి వరకు 1000 కి పైగా చిత్రాలలో నటించింది.

ఈమె తండ్రి ఎనిగండ్ల జ్ఞానయ్య, తల్లి బాలమ్మ.ఈమె తండ్రి సహకార శాఖలో పనిచేస్తుండటంతో వీరి కుటుంబం ఒకచోట స్థిరంగా ఉండేదికాదు. ఆయన కర్నూలు లో పనిచేస్తున్నపుడు వై. విజయ అక్కడే జన్మించింది. తర్వాత ఆయనకు కడప కు బదిలీ కావడంతో విజయ బాల్యమంతా కడప లోనే గడిచింది. వీరు మొత్తం 10 మంది సంతానం. నలుగురు మగపిల్లలు, ఆరుగురు ఆడపిల్లలు. పది మందిలో విజయ ఐదవది. ఈమె ఎనిమిదవ తరగతి వరకు కడప ప్రభుత్వ పాఠశాలలో చదివింది.


block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top