ఉగాది రోజు ఈ పని తప్పకుండా చేస్తే చాలా మంచిది. ఎన్ని పనులున్నా మరచిపోకండి…


ఉగాది రోజున తప్పనిసరిగా పంచాంగ శ్రవణం చేయాలి. ఇది మన ఆచారంగా మన పూర్వీకుల నుంచి వచ్చింది. ఉగాది రోజు పంచాంగ శ్రవణం చేయడం వలన రాశి ఫలాలను బట్టి ఏమైనా పూజలు చేయించుకోవలసి ఉన్నా, ఇంకేమైనా జాగ్రత్తలు తీసుకోవాలన్న తీసుకోవచ్చు. ఏ రాశి వారికి ఈ ఏడాది ఎలా ఉంటాదో చూద్దాం…

మేషరాశి… ఈ రాశివారికి సంవత్సర ప్రధమార్ధం సామాన్యంగా ఉండి, తరవాత బాగుంటుంది. ప్రధమార్ధం లో ధనవ్యయం, సమస్యలు వచ్చును. రైతులకు రెండవ పంట బాగుంటుంది. రాజకీయనాయకులకు, NRI లకు అంతగా బాగోదు. ఆర్ధికంగా చాలా జాగ్రత్తగా ఉండాలి.

CLICKHERE : ఈ ఉగాది నుండి మీ జాతకం ప్రకారం..మీ ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి


వృషభరాశి…ఆర్ధికంగా బాగుంటుంది. కుటుంబ కలహాలు, కోర్టు తీర్పులు చోటు చేసుకుంటాయి. సంతాన పురోగతి భాగుంటుంది. చిరాస్తులు కొనుక్కుంటారు.కొన్ని అమ్ముతారు కూడా. ప్రతిష్టాత్మకమైన విషయాలలో విజయం సాధిస్తారు.వ్యాపార అభివృద్దికి చాలా కష్టపడతారు. ద్విచక్ర వాహనం నడపవద్దు. ఆరోగ్య సమస్యలు ఎదుర్కుంటారు.

మిధునరాశి...ఆర్ధికంగా భాగుంటుంది. ప్రజాసంభందాలు పెరుగుతాయి. అందరిలో మంచి పేరు వస్తుంది. కొన్ని ఆరోగ్య సమస్యలతో మోకాళ్ళు, నడుము , పాదాల నొప్పులతో బాధపడతారు. ఆస్తులు కొంటారు. సంతానాన్ని బాగా చూసుకుంటారు. కొన్ని మంచి పనులు కూడా చేస్తారు.

CLICKHERE : ఫేస్ బుక్, జీమెయిల్ ద్వారా ఓటు వేసి మన తెలుగోళ్లని గెలిపించండి.

కర్కాటకరాశి…ఈ రాశి వారు ప్రతీ విషయంలో పోరాటం చేయాల్సివస్తుంది.సంతానం విషయంలో కొన్ని సమస్యలు వచ్చును.షుగర్, బీపీ ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. ఆస్తులు అమ్ముదామానుకున్న మంచి ధర రావు.

సింహరాశి… ఈ రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్ధిక ఇబ్బందులతో పాటు, వృత్తి, వ్యాపారాలలో ఇబ్బందుల వలన చాలా నష్టపోతారు. మీరు ఎన్ని రకాలుగా ఎదగాలని మంచి ప్లాన్ లు వేసినా కూడా, నష్టాలను తెచ్చి పెడ్తుంది. మీ తప్పు ఏమీ లేకపోయినా సమస్యలు వస్తాయి. కాని ధైర్యంగా ఎదుర్కుంటారు.

కన్యారాశి…నూతన వాహనాల కొనుగోలు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వివాహసంభంధమైన విషయంలో జాగ్రత్తగా ఉండాలి.అధిక ఆదాయం గాని, అధిక ఖర్చు గాని ఉండదు. అప్పు చేయకుండా గడిస్తే చాల గ్రేట్ అని అనుకోవాలి. ఆరోగ్య సమస్యలు కొన్ని వస్తాయి. మీరు పెంచి పోషించినవారితోనే వైరం వస్తుంది. లేని పోనీ సమస్యలు మీ నెత్తి మీదకు వస్తుంటాయి.

CLICKHERE : హిందూ ద‌ర్శ‌శాస్త్రం ప్ర‌కారం ఎట్టి పరిస్థితుల్లో కింద‌పెట్ట‌కూడని 5 వ‌స్తువులు ఇవే.!

తులారాశి… వ్యాపార, ఉద్యోగాలలో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. అండగా ఎవ్వరు ఉండరు. ఇ.ఎన్.టీ సమస్యలు వస్తాయి. సంతానం లేని వారికి సంతానం, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తాయి. వ్యాపారంలో మోసపోయే అవకాశం ఉంది. సంతానం విషయం లో కొన్ని చికాకులు ఉంటాయి. కొందరిని కలవకూడదని నిర్ణయం తీసుకుంటారు.

వృశ్చికరాశి…ఆర్ధికంగా భాగుంటారు. ప్రతీ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. పరువు ప్రతిష్టలు పెరుగుతాయి.మీరు ఆశించిన పదవి మీకు వస్తుంది.వివాహం విషయంలో కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. స్థిరాస్తి కోసం మీ ప్రయత్నాలు అంతగా ఫలించవు.

ధనుస్సురాశి… ఈ రాశి వారు అనేక ఇబ్బందులను ఎదుర్కుంటారు. ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. తీసుకున్న డబ్బుకు ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. అందరి చేతిలో మోసపోతారు. మోకాళ్ళ నొప్పులు బాధిస్తాయి. ఎక్కువ శ్రమ తక్కువ గుర్తింపు వస్తుంది. మీరు ఎవరికైనా మంచి చెప్పాలి అనుకున్నా వారు అర్ధం చేసుకోరు.

మకరరాశి… ఈ రాశివారికి స్థిరాస్తి విషయంలో కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కోర్టు వ్యవహారంలో ముప్పు తిప్పలు పడతారు. కొన్ని దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఎన్ని సమస్యలు ఉన్నా మీ ధైర్యంతో, స్వయం కృషితో సమస్యలను పరిష్కరించుకుంటారు. ఈ రాశివారు 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించాలి. అఘోరపాశుపత హోమం చేయాలి.

కుంభరాశి… వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు బాగుంటాయి. అన్ని రంగాల వారికి బాగుంటుంది. శత్రువులు ఏమీ చేయలేరు.బంధువుల, స్నేహితుల సహాయం కూడా దొరుకుతుంది. అనుకున్న పనులు అవుతాయి. రాజయోగం కొనసాగుతుంది.

మీనరాశి… మంది చెడులు సమానంగా ఉంటాయి. దేనినైనా సాధించడానికి అనేక కష్టాలు పడి, చివరికీ సాధిస్తారు. శత్రువు మిత్రులు అవుతారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. సంతాన పురోగతి భాగుంటుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top