జయసుధ సిస్టర్ ను చూసారా..? ఆమె కూడా ఒక హీరోయిన్ అన్న విషయం మీకు తెలుసా?

సహజ నటిగా పేరుపొందిన జయసుధ తెలుగు సినిమా నటి. ఈమె అసలు పేరు సుజాత. 1959 డిసెంబర్ 17న మద్రాస్ లో జన్మించారు. పుట్టి పెరిగినది మద్రాసులో అయినా మాతృభాష తెలుగే. నటి, నిర్మాత విజయనిర్మల ఈవిడకు మేనత్త . 1972 లో లక్ష్మీదీపక్ దర్శకత్వంలో వచ్చిన పండంటి కాపురం జయసుధ మొదటి చిత్రం. 

జయసుధ నటించిన 300లకు పైగా సినిమాల్లో 20 తమిళ సినిమాలు, 8 మలయాళ సినిమాలు, 3 హిందీ సినిమాలు, 1 కన్నడ సినిమా ఉన్నాయి. తనకంటూ ఒక ఇమేజ్ వచ్చాక తన చెల్లెలు సుభాషిణిని కూడా సినీ రంగానికి పరిచయం చేసింది.  సుభాషిణి కొన్ని సినిమాల్లో నటించింది. అరుంధతి సినిమాలో నటించి మెప్పించింది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top