అక్షయ తృతీయ నాడు అసలు చేయాల్సిన పని ఏమిటో తెలుసా?

అక్షయ తృతీయ అనగానే చాలామంది బంగారం కొనుక్కోవడం అని అనుకుంటారు. అసలు అక్షయ తృతీయ అంటే ఏమిటి? ఆరోజు ఏం చెయ్యాలో తెలుసుకుందాం…


అక్షయ తృతీయ నాడే కృతయుగం ప్రారంభమైందని, శ్రీ హరి పరుశురాముడిగా అవతరించింది ఈ రోజునే కాబట్టి ఏ పని చేపట్టినా అది అక్షయంగా మిగిలిపోతుందనేది భారతీయుల ముఖ్యంగా హిందువుల నమ్మకం. ఆరోజు చేసిన పూజలు, పుణ్య, ధార్మిక కార్యక్రమాల ఫలితం ఎన్ని జన్మలెత్తినా అలాగే ఉంటుందని పురాణాలు పేర్కొంటున్నాయి. కాబట్టి వైశాఖ శుద్ధ తదియ అక్షయ తృతీయను పండుగలా జరుపుకుంటారని పండితులు అంటున్నారు. ఈ రోజున పూజలు, జపాలు, దానం చేయాలి. ఈ పుణ్యఫలం జన్మజన్మలకూ తోడుగా నిలుస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి.

అక్షయ తృతీయ నాడు అచంచలమైన భక్తితో శ్రీమహావిష్ణువుకు శిరస్సు వంచి నమస్కరిస్తే చాలు. శ్రీమన్నారాయణుడికి ప్రీతికరమైనవి ఆయన దేవేరి మహాలక్ష్మీ‌కి కూడా ఎంతో ఇష్టం. అక్షయ తృతీయ నాడు సూర్యోదయానికి ముందే మేల్కొని స్నానం ముగించిన తర్వాత శ్రీ మహావిష్ణువు పాదాల చెంత అక్షతలు ఉంచి పూజ చేయాలి. ఇది శ్రీ మహావిష్ణువు, మహాలక్ష్మీకి సంబంధించిన రోజు కావడంతోనే లక్ష్మీ స్వరూపమైన సువర్ణాన్ని అందరూ కొంటారు. అంతేకాని ఈరోజు బంగారం మాత్రమే కొనాలని ఏమీ లేదు. శ్రీమహావిష్ణువుకు శిరస్సు వంచి ఏదైనా దానం, మంచిపని చెయ్యండి. అంతా మంచి జరుగుతుంది….
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top