జాగ్రత్త : ఈ ఆఫర్ చూసి మోసపోవద్దు

ఈ రోజుల్లో డిస్కౌంట్ సేల్… ఈ బోర్డు కనిపిస్తే చాలు కొనుగోలు చేసే వస్తువు ఏ బ్రాండ్ అయినా ఎలా ఉన్నా.. కాంప్రమైజ్  అవుతున్నారు  వినియోగదారులు. అలాంటిది ఏకంగా రూ.14వేల మొబైల్ ను కేవలం రూ.499 కే ఇస్తామనే  మెసేజ్ చూసి కక్కుర్తి బ్యాచ్ ఆశలకు హద్దులు లేకుండా పోయాయి. వాట్సాప్ లో వచ్చిన ఒక ఫార్వాడ్ మెసేజ్ ను ఆధారంగా చేసుకొని పది మందికి ఆ లింకును పంపితే చాలు అనగానే అందరూ ఫార్వాడ్ చేసేశారు. ఇలా ప్రతి ఒక్కరు పంపేసి.. ఆ తరువాత వచ్చిన సైట్ లో మొబైల్ ఆర్డర్ చేసుకున్నారు. కొంచెం అమేజాన్ సైట్ లా కనిపించడంతో ఎక్కడ ఎవ్వరికీ చిన్న సందేహం కూడా రాలేదు. 

చాలా తక్కువ ధర ఉండటంతో అసలు అమేజాన్ లో ఆ మొబైల్ సేల్స్ ఉన్నాయో లేదో కూడా ఎవరు చెక్ చేసుకోలేదు. అయితే జియో మీ రెడ్ మీ నోట్ 4 ఫోను కేవలం ఫ్లిప్ కార్ట్ సంస్థనే విక్రయించాలనే ఒప్పందం చేసుకుందని తెలియని ప్రజలు మోసపోయారు. ఆ సైట్ లో ఇచ్చే కార్డు వివరాలను.. యూజర్ ఐడీ.. పాస్ వర్డ్.. అన్నింటినీ రహస్యంగా దొంగలిస్తూ సైబర్ క్రైమ్ కు పాల్పడుతోంది ఓ టీమ్. లింకు ఓపెన్ చేయగానే మొబైల్ ను హాక్ చేసి వివరాలు సేకరించి అకౌంట్ లో డబ్బులు దోచుకుంటున్నారు. ఇలా ఆఫర్లకు ఆశ పడితే చివరికి మోసపోవాలే కానీ మొబైలు రాదనే నిజాన్ని ఇప్పటికైనా వినియోగదారులు తెలుసుకుంటే మంచిదని నిపుణులు అంటున్నారు. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top