మరో సంచలన ప్రకటన చేసిన జియో..

రిలయన్స్ జియో టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. టెలికాం రంగంలో రిలయన్స్ జియో విశేషాదరణ పొందింది. ఇప్పుడు జియో తాజాగా డీటీహెచ్ రంగంలోకి ప్రవేశించింది. అత్యంత చౌకగా డేటా ఇస్తూ టెలికాం కంపెనీలకు చుక్కలు చూపించిన జియో మరో సంచలన నిర్ణయంతో ఇపుడు డిటిహెచ్ (DTH) గుండెల్లో రైళ్లు పరుగెత్తేలా చేస్తుంది. రిలయన్స్ జియో డీటీహెచ్ సర్వీసులను మే నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపారు. సెట్ టాప్ బాక్స్ లు సిద్ధమయ్యాయని, ఇక సర్వీస్ ను ప్రారంభించడమే తరువాయి అని జియో ప్రకటించింది. 

అంతేకాదు జియో సెట్ టాప్ బాక్స్ ను ఇంటర్ నెట్ సేవలకు అనుసంధానం చేసేందుకు వీలుగా రూపొందించినట్లు తెలిపింది. జియో ఇప్పటికే.. ఈ సేవల నిమిత్తం ప్రధాన నగరాల్లో పనులు ప్రారంభించినట్లు అధికారికంగా పేర్కొంది. కేవలం 20 నుండి 40 రూపాయలకే 200పైగా చానెల్స్ ను ప్రసారం చేయనున్నారనే వార్తతో DTH కంపెనీల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. కానీ రిలయన్స్ జియో తెలిపిన వివరాల ప్రకారం డీటీహెచ్ సేవలు, వాటి ధరలు ఈ కింది విధంగా ఉండబోతున్నాయి.
జియో డీటీహెచ్ ధర: 1800 రూపాయలు

జియో డీటీహెచ్ బుకింగ్: ఏప్రిల్ 2017

జియో డీటీహెచ్ ప్లాన్(లోయెస్ట్): 180 రూపాయలు.. నెలకు

జియో డీటీహెచ్ లాంచ్ డేట్: మే 2017
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top