బాహుబలి-2 కంప్లీట్ రివ్యూ…అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పిన జక్కన్న

సమర్పణ: కె.రాఘవేంద్రరావు
నిర్మాణ సంస్థ: ఆర్కా మీడియా వర్క్స్‌
తారాగణం: ప్రభాస్‌, అనుష్క, తమన్నా, రానా, సత్యరాజ్‌, నాజర్‌, రమ్యకృష్ణ , సుబ్బరాజు తదితరులు
సంగీతం: ఎం.ఎం.కీరవాణి
సినిమాటోగ్రఫీ: కె.కె.సెంథిల్‌కుమార్‌
కథ: వి.విజయేంద్రప్రసాద్‌
ప్రొడక్షన్‌ డిజైనర్‌: సాబుశిరిల్‌
వి.ఎఫ్‌.ఎక్స్‌: కమల్‌ కణ్ణన్‌
కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
యాక్షన్‌: కింగ్‌ సాల్మాన్‌
సౌండ్‌ డిజైనర్‌: పి.ఎం.సతీష్‌
క్యాస్టూమ్స్‌: రమారాజమౌళి, ప్రశాంతి త్రిపురినేని
లైన్‌ ప్రొడ్యూసర్‌: శ్రీవల్లీ
నిర్మాతలు: శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని
దర్శకత్వం: ఎస్‌.ఎస్‌.రాజమౌళి

బాహుబలి..రాజమౌళి, రెండు పేర్లు, ఐదేళ్ళ ప్రయాణం..కానీ తెలుగు సినిమాలో మరచిపోలేని చరిత్రను క్రియేట్‌ చేశాయి. విజువల్‌ వండర్‌గా తెరకెక్కిన ఈ సినిమాను రెండు పార్టులుగా తెరకెక్కించారు. బాహుబలి ది బిగినింగ్‌ సినిమా 2015లో విడుదలై 600 కోట్లకు పైగా కలెక్షన్స్‌తో తెలుగు సినిమా చరిత్రను ప్రపంచానికి తెలియజేశాయి. పార్ట్‌ 1 కనీవినీ ఎరుగని రీతిలో విజయం సాధించడంతో బాహుబలి 2 ఎలా ఉంటుందోనని ఆసక్తి మరింత పెరిగింది. అసలు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే ప్రశ్న ఈ రెండేళ్లు అందరిలో క్యూరియాసిటినీ మరింత పెంచింది. దాదాపు రెండేళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తున్న 'బాహుబలి 2' ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంది..అసలు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అనే విషయాలు తెలుసుకోవాలంటే ముందు కథలోకి వెళదాం..

కథ:
బాహుబలి ది బిగినింగ్‌కు కొనసాగింపుగా బాహుబలి 2 మొదలవుతుంది. కాళకేయులపై గెలిచిన తర్వాత అమరేంద్ర బాహుబలిని రాజమాత శివగామి మహారాజుగా ప్రకటిస్తుంది. అది భళ్ళాళదేవుడుకి, బిజ్జలదేవుడుకి నచ్చదు. ఎలాగైనా రాజ్యాన్ని చేజిక్కించుకోవాలని ఆలోచనలు చేస్తుంటారు. మహారాజుగా పట్టాభిషేకం చేసేలోపు ప్రజల బాగోగులు చూడాలని బాహుబలి, కట్టప్పతో కలిసి దేశాటన బయలుదేరుతాడు. చిన్నరాజ్యమైన కుంతల దేశాన్ని చేరుతాడు. అక్కడ దేవసేనను చూసి ప్రేమిస్తాడు. ఆమె ప్రేమ పొందడానికి అక్కడే మకాం వేస్తాడు. దేవసేన అందం తెలివి తేటలు తెలుసుకున్న భళ్ళాలదేవుడు, దేవసేనను తనకు భార్యగా చేయమని శివగామిని కోరుతాడు. శివగామి కూడా మాట ఇచ్చి కానుకలు పంపుతుంది. అయితే బాహుబలిని ప్రేమిస్తున్న దేవసేన ఆమె కోరికను తిరస్కరించి ఆమె కోపానికి గురవుతుంది. బాహుబలి దేవసేనను తన రాజ్యానికి తీసుకుని వస్తాడు. అక్కడ రాజ్యం కావాలా? దేవసేన కావాలా? అనే సందిగ్ధం ఏర్పడినప్పుడు బాహుబలి దేవసేనకు ఇచ్చిన మాట ప్రకారం ఆమెనే పెళ్లాడుతాడు. మహారాజు పదవిని వదులుకుని సర్వసైన్యాధ్యక్షుడుగా పదవిని అలంకరిస్తాడు. అయితే బాహుబలికి ప్రజల్లోని గౌరవాన్ని తగ్గించాలనే ఆలోచనతో భళ్ళాళదేవుడు, బాహుబలిపై కుట్రలు చేసి సైన్యాధ్యక్ష పదవి నుండి తొలిగిస్తాడు. తనపై తనే హత్యాయత్నం చేసుకుని బాహుబలిపై శివగామికి అనుమానం వచ్చేలా చేసి ఆమె నోటితో బాహుబలిని చంపమని కట్టప్పకు ఆదేశం ఇచ్చేలా ప్రణాళిక చేస్తాడు. ఇంతకు బాహుబలిని కట్టప్ప చంపుతాడా? శివగామికి చివరకు నిజం ఎలా తెలుస్తుంది? తన తండ్రి గతం, గొప్పతనం గురించి తెలుసుకున్న శివుడు భళ్ళాలదేవుడుని ఎలా ఎదుర్కొంటాడు? తన తల్లి దేవసేనకు విముక్తి ఎలా కలిగిస్తాడు? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...

బలాలు:
- కథనం
- ఎమోషనల్‌ డ్రామా
- సంగీతం
- బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌
- సినిమాటోగ్రఫీ
- విఎఫెక్స్‌

బలహీనతలు:
- నిడివి ఎక్కువగా ఉండటం

బోటమ్‌ లైన్‌: భళి భళి రా భళి..సాహోరే బాహుబలి

రేటింగ్‌: 4.5/5
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top