నెలకు రూ.100లే.. ఏడాదిన్నర పాటు జియో 4జీ అన్ లిమిటెడ్ డేటా, వాయిస్ కాల్స్!!

రిలయన్స్ జియో ఇక భారత దేశంలో ప్రత్యర్థి టెలికం సంస్థలను నడవనిచ్చేలా లేదు. జియో రిలీజ్ అయిన 8 నెలల నుంచి ఏదో ఒక పేరిట ఫ్రీ ఆఫర్లు ఇస్తూ ఇతర సంస్థల మొబైల్ డేటా వ్యాపారాన్ని వేల కోట్లు దెబ్బతీసింది. ఇక జియో కూడా రేట్లు పెట్టేసింది.. ఊపిరి పీల్చుకోవచ్చని ఎయిర్ టెల్, ఐడియా, బీఎస్ఎన్ఎల్, వొడాఫోన్ వంటి సంస్థలు భావిస్తున్న సమయాన మరో పిడుగుపాటు వార్త అదే హ్యాపీ సమ్మర్ ఆఫర్. 

జులై 31 వరకు కేవలం 303రూ.లకే అన్ లిమిటెడ్ డేటా ఫ్రీ ఇచ్చేసింది జియో మళ్లీ.. ఇక ఆ తర్వాత వ్యాపారం చేసుకుందామని భావిస్తుండగా మళ్లీ సునామీ లాంటి విషయం ఒకటి భయటికొచ్చింది. దాని సారాంశమేమంటే రూ.100 చొప్పున ప్రతినెలా కలెక్ట్ చేస్తూ ఇంకా ఏడాదిన్నర వరకు జియో అన్ లిమిటెడ్ డేటా, వాయిస్ కాల్స్ ఆఫర్ ఇస్తుందట. దీనిపై ప్రముఖ బిజినెస్ స్టాండర్డ్ పత్రిక కథనం ఇచ్చింది. ఆ కథనంలో..

ప్రత్యర్థి కంపెనీలను జియో ఉక్కిరిబిక్కిరి చేస్తోందని వ్యాఖ్యానించింది అమెరికన్ బ్యాంక్ మోర్గాన్ స్టాన్లే. కంపెనీలపై ఒత్తిడి పెంచుతుందని తెలిపింది. ప్రస్తుత ఆఫర్లను కొనసాగిస్తూనే.. టెలికాం రెగ్యులేటరీ నిబంధనలకు అనుగుణంగా నామమాత్రపు ఛార్జీలు వసూలు చేసే అవకాశం ఉందని తెలిపింది. నెలకు కేవలం రూ.100లతో అన్ లిమిటెడ్ డేటా ఆఫర్ తీసుకొచ్చే ఆలోచనలో ఉంది. ఇలాంటి తక్కువ డేటా ప్లాన్ తో మిగతా కంపెనీలు ముందుకొచ్చినా.. సంవత్సరాల తరబడి తట్టుకుని నిలబడే అవకాశం ఉండదని రిలయన్స్ ఎత్తుగడ. 

మూడు నెలల జియో ఆఫర్ల ప్రారంభమైన 170 రోజుల్లోనే 10 కోట్ల మంది వినియోగదారులను సంపాదించిందని.. అంటే రోజుకు 6 లక్షల మంది వినియోగదారులను పొందిందని తెలిపింది. రానున్న రోజుల్లో తన నెట్ వర్క్ ను మరింత పెంచుకునేందుకు.. ప్రత్యర్థులు ఊహించని విధంగా భారీ వ్యూహాలను రచిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top