ఎన్టీఆర్ పై ఆయన భార్య.. లక్ష్మీ ప్రణీత బాగా కోపగించుకుంది అంటా..? అదేంటి ఎన్టీఆర్ పై ప్రణీతకు కోపం రావడం ఏంటి అనుకుంటున్నారా..? అవును ఇది నిజం. ఈ విషయంను స్వయంగా ఎన్టీఆర్.. ఇటీవల జరిగిన ఒక మీడియా ఇంటర్వ్యూ లో సరదాగా తెలిపారు. సినిమాలో హీరోలు విల్లన్స్ ని శాసించిన ఇంట్లో మాత్రం భార్య మాటను వేదంగా పాటించవలసిందే.
రీసెంట్ గా ఒక సంఘటన ఎన్టీఆర్ దంపతుల మధ్య జరిగింది. ఎన్టీఆర్ ప్రణీత ల కుమారుడు అభయ్ రామ్. అభయ్ అంటే ఎన్టీఆర్ దంపతులకు ప్రాణం. అటువంటి అభయ్ కి స్నానం చేయిస్తుండగా జారి కింద పడిపోయాడు. దాంతో అభయ్ కి గాయమయింది. రెండు రోజులు ఆసుపత్రి చుట్టూ తిరిగారు. ఎన్టీఆర్ అజాగ్రత్త వాళ్ళ ముద్దుగా చూసుకుంటున్న కొడుకుకు దెబ్బ తగలడంతో లక్ష్మీ ప్రణీత ఎన్టీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేసిందట. కొడుకుకు తగిలిన దెబ్బ వాళ్ళ లక్ష్మీ బాగా బాధపడిందట. తరువాత ఎన్టీఆర్ నచ్చజెప్పడం వాళ్ళ కొంచెం శాంతించింది. ఈ సంఘటన చూస్తే అర్ధం అవుతుంది మధ్య తరగతి కుటుంబాలలోనే కాదు పెద్ద పెద్ద సెలబ్రెటీల ఇళ్లలో కూడా ప్రేమలు, అభిమానాలు ఉంటాయని…