సుందర్ పిచాయ్ కు గూగుల్ అదిరిపోయే నజరానా

సుందర్ పిచాయ్. ప్రపంచ ప్రతిష్టాత్మకమైన గూగుల్ సంస్థ సీఈఓ గా నియమితుడయ్యాక ఈ పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోతుంది. 2015 అగస్ట్ లో గూగుల్ సీఈఓ గా ఎన్నికైన సుందర్ పిచాయ్ కు గూగుల్ సంస్థ అదిరిపోయే నజరానా ప్రకటించింది. 2015 సవత్సరంలో 99.8 మిలియన్ డాలర్ల జీతాన్ని అర్జించిన సుందర్ పిచాయ్ 2016 సవత్సరానికి గాను 198.7మిలియన్ డాలర్లను తన ఖాతాలో వేసుకున్నారు. అంటే అక్షరాల 1285 కోట్ల రూపాయలన్నమాట. గతేడాదితో పోల్చుకుంటే ఈ యేడాది రెట్టింపు మొత్తాన్ని పొందారు.

సుందర్ పిచాయ్ గూగుల్ సీఈఓ గా బాధ్యతలు చేపట్టాక కంపేనీని లాభాల బాటలో పరుగులు పెట్టించారు. ఆ త‌ర్వాత ఆయ‌న‌కు స్టాక్‌ అవార్డు కింద 200 మిలియన్ డాల‌ర్లు వ‌చ్చాయి. మరోవైపు గూగుల్ అమ్మకాలు కూడా 22.5 శాతం పెరిగాయి. దాని నికర ఆదాయం కూడా 19 శాతం పెరిగింది. అత్యుత్తమంగా రాణిస్తున్న ఉద్యోగుల‌కు గూగుల్ సంస్థ ప్రతి యేడాది నజరానా ప్రకటిస్తుంది. గూగుల్ క్రోమ్, క్రోమ్ ఓఎస్ లాంటి ఉత్పత్తులను నిర్మించడంలో పిచాయ్‌ కీలక పాత్ర పోషించాడు
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top